COVID-19: Guidelines for Surveillance to
remain in force up to Jan 31
కొవిడ్ నిబంధనలు మళ్లీ పొడిగించిన
కేంద్రం
- రాష్ట్రాలకు హోంశాఖ తాజా ఆదేశాలు
దేశంలో కరోనా వైరస్ కట్టడికి విధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. జనవరి 31వరకూ కొవిడ్ మార్గదర్శకాలు అమలులో ఉంటాయని స్పష్టం చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సోమవారం ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలే జనవరి 31వరకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని నిబంధనలు పాటించాల్సిన ఆవశ్యకతను గుర్తుచేసింది. బ్రిటన్‌లో కలకలం సృష్టించిన కరోనా కొత్త వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని నిరంతరం నిఘా, వైరస్ కట్టడికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.
కంటైన్‌మెంట్ జోన్‌ల గుర్తింపు, ఆయా
జోన్‌లలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్రాలను కోరింది. వైరస్ ప్రభావం ఉన్న
ప్రాంతాల్లో నిర్దేశించిన నియంత్రణ చర్యలు కచ్చితంగా పాటించాలని తెలిపింది. నవంబర్
25న కేంద్ర హోంశాఖ, ఆరోగ్య కుటుంబ
సంక్షేమశాఖ విడుదల చేసిన మార్గదర్శకాలనే రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు
కఠినంగా అమలు చేయాలని స్పష్టంచేసింది.
0 Komentar