Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CSIR-CDRI Technical & Support Staff Recruitment-2020

CSIR-CDRI Technical & Support Staff Recruitment-2020

సీడీఆర్ఐలో టెక్నిక‌ల్‌, స‌పోర్ట్ స్టాఫ్

ల‌ఖ్‌న‌వూలోని సీఎస్ఐఆర్‌-సెంట్ర‌ల్ డ్ర‌గ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌(సీడీఆర్ఐ) టెక్నిక‌ల్ అండ్ స‌పోర్ట్ స్టాఫ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 55

1) సీనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్: 02 పోస్టులు

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి క‌నీసం 55% మార్కుల‌తో బీవీఎస్సీ & ఏహెచ్‌, ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత నైపుణ్యాల్లో అనుభ‌వం ఉండాలి.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.  రాత‌ప‌రీక్ష‌లో అర్హ‌త సాధించిన వారిని ఇంట‌ర్వ్యూకి పిలుస్తారు.

ప‌రీక్షా విధానం: దీనిలో మూడు పేప‌ర్లు ఉంటాయి. దీన్ని 200 మార్కుల‌కు నిర్వ‌హిస్తారు. ప‌రీక్షా స‌మ‌యం 3 గంట‌లు ఉంటుంది. ఈ ప‌రీక్ష ఓఎంఆర్ బేస్డ్‌/ క‌ంప్యూట‌ర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మ‌ల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటుంది. ఈ ప‌రీక్షను ఇంగ్లిష్‌, హిందీ మాధ్య‌మంలో నిర్వ‌హిస్తారు. ఈ ప‌రీక్ష‌లో ప్ర‌శ్న‌లు  పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా/ పోస్టు గ్రాడ్యుయేష‌న్/ బీఈ/ బీటెక్‌ స్థాయిలో ఉంటాయి.

* పేప‌ర్‌-1: మెంట‌ల్ ఎబిలిటీ టెస్ట్‌, పేప‌ర్‌-2: జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌, పేప‌ర్-3: స‌ంబంధిత స‌బ్జెక్టుల నుంచి ప్ర‌శ్న‌లు ఉంటాయి.

2) టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ & టెక్నిక‌ల్ అసిస్టెంట్‌: 42 పోస్టులు

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా(ఇంజినీరింగ్‌), బీఎస్సీ, బీఈ/ బీటెక్‌, ఎంబీఏ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత నైపుణ్యాల్లో అనుభ‌వం ఉండాలి.

ఎంపిక విధానం: ట‌్రేడ్ టెస్ట్‌‌, రాత‌ప‌రీక్ష ఆధారంగా ఎంపిక ప్ర‌కియ ఉంటుంది. ట్రేడ్ టెస్ట్‌లో అర్హ‌త సాధించి అభ్య‌ర్థుల‌ను రాత‌పరీక్ష‌కు పిలుస్తారు. తుది ఎంపిక మాత్రం రాత‌పరీక్ష‌లో ప్ర‌తిభ ఆధారంగా ఉంటుంది.

ప‌రీక్షా విధానం: ఓఎంఆర్ బేస్డ్‌/ క‌ంప్యూట‌ర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మ‌ల్టిపుల్ ఛాయిస్ ప‌ద్ధ‌తిలో ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ఈ ప‌రీక్ష ఇంగ్లిష్‌, హిందీ మాధ్య‌మంలో ఉంటుంది. డిప్లొమా/ గ‌్రాడ్యుయేష‌న్ స్థాయిలో ప్ర‌శ్న‌ల స‌ర‌ళి ఉంటుంది. దీన్ని 200 మార్కుల‌కు నిర్వ‌హిస్తారు. ప‌రీక్షా స‌మ‌యం 3 గంట‌లు ఉంటుంది.

* పేప‌ర్‌-1: మెంట‌ల్ ఎబిలిటీ టెస్ట్‌, పేప‌ర్‌-2: జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌, పేప‌ర్-3: స‌ంబంధిత స‌బ్జెక్టుల నుంచి ప్ర‌శ్న‌లు ఉంటాయి.

3) టెక్నీషియ‌న్ (స‌పోర్ట్ స్టాఫ్‌): 11 పోస్టులు

అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణ‌త‌, క‌నీసం రెండేళ్ల అనుభ‌వం ఉండాలి.

ఎంపిక విధానం: ట‌్రేడ్ టెస్ట్‌‌, రాత‌ప‌రీక్ష ఆధారంగా ఎంపిక ప్ర‌కియ ఉంటుంది. ట్రేడ్ టెస్ట్‌లో అర్హ‌త సాధించి అభ్య‌ర్థుల‌ను రాత‌పరీక్ష‌కు పిలుస్తారు. తుది ఎంపిక మాత్రం రాత‌పరీక్ష‌లో ప్ర‌తిభ ఆధారంగా ఉంటుంది.

ప‌రీక్షా విధానం: ఓఎంఆర్ బేస్డ్‌/ క‌ంప్యూట‌ర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మ‌ల్టిపుల్ ఛాయిస్ ప‌ద్ధ‌తిలో ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ఈ ప‌రీక్ష ఇంగ్లిష్‌, హిందీ మాధ్య‌మంలో ఉంటుంది. ఎస్ఎస్‌సీ + ఐటీఐ స్థాయిలో ప్ర‌శ్న‌ల స‌ర‌ళి ఉంటుంది. మొత్తం 150 ప్ర‌శ్న‌లు ఉంటాయి. ప‌రీక్షా స‌మ‌యం రెండు గంట‌ల 30 నిమిషాలు ఉంటుంది.

* పేప‌ర్‌-1: మెంట‌ల్ ఎబిలిటీ టెస్ట్‌, పేప‌ర్‌-2: జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌, పేప‌ర్-3: స‌ంబంధిత స‌బ్జెక్టుల నుంచి ప్ర‌శ్న‌లు ఉంటాయి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ద‌ర‌ఖాస్తు ఫీజు: ఇత‌రుల‌కు రూ.100, ఎస్సీ/ ఎస్టీ/  పీడ‌బ్ల్యూడీ/ స‌్త్రీ అభ్య‌ర్థుల‌కు ఫీజు లేదు.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 05.02.2021.

ఆఫ్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 22.02.2021.

చిరునామా: Director, CSIR-Central Drug Research Institute, Sector 10, Jankipuram Extension, Sitapur Road, Lucknow – 226031, Uttar Pradesh, India.

WEBSITE

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags