Dual Front Airbags Mandatory From 1
April 2021, Centre Seeks Public View
వాహనాల్లో ఎయిర్‌బ్యాగ్స్
తప్పనిసరి.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి, పాత
వాటిలోనూ అమర్చుకోవాల్సిందే!
కార్లు తదితర ప్రయాణికుల వాహనాల్లో ముందు భాగంలో ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరి చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. 2021 ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనను అమల్లోకి తీసుకురానుంది.
కార్లు తదితర అన్ని రకాల ప్రయాణికుల వాహనాల్లో ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. 2021 ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనను అమలు చేయాలని భావిస్తోంది. అంతేకాదు.. పాత వాహనాల్లోనూ ఎయిర్‌బ్యాగ్స్ (Airbags) అమర్చుకోవాలనే నిబంధనను విధించనున్నారు. దీనికి జూన్ 1 వరకు గడువు ఇవ్వనున్నారు. కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం (డిసెంబర్ 29) ఈ మేరకు ముసాయిదా ప్రతిపాదనలతో కూడిన గెజిట్ విడుదల చేసింది.
ఈ ప్రతిపాదనపై ప్రజలు, ఇతర వర్గాల నుంచి సలహాలు, సూచనలు కోరారు. కార్లు తదితర వాహనాల్లో ముందు భాగంలో ఎయిర్ బ్యాగ్స్ కచ్చితంగా ఉండాలని కేంద్రం భావిస్తోంది. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో సీటు బెల్టు ధరించకపోవడం, ఎయిర్ బ్యాగ్స్ లేకపోవడం వల్లే ఎక్కువ మంది మరణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయాన్ని తప్పనిసరి చేస్తే.. ఇక కార్లు, ఇతర వాహనాల ఉత్పత్తిదారులు అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. పాత వాహనాలకు కూడా ఎయిర్‌బ్యాగ్స్ అమర్చే బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సంస్థలు దీన్ని ఆసరాగా తీసుకొని ప్రజలపై అధిక భారం వేసే ప్రమాదం కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా కేంద్రం తగిన మార్గదర్శకాలను విడుదల చేయనుంది. రవాణా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గెజిట్‌లో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు.
కొత్తగా ఉత్పత్తి చేసే వాహనాల్లో
ప్రయాణికుల సీట్లలోనూ ఎయిర్‌బ్యాగ్స్ అమర్చేలా ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ (AIS) నియమావళిలో మార్పులు చేయనున్నారు. ఈ నిర్ణయం తప్పనిసరి చేస్తే కార్ల ధరలు
స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.
0 Komentar