Election Commission mulls providing
digital voter ID card to voters
కొత్తగా డిజిటల్ ఓటర్ కార్డు!
మీరు మీ ఓటరు గుర్తింపు కార్డును పోగొట్టుకున్నారా.? లేదా ఎక్కడో పెట్టి మర్చిపోయారా.? ఓటరు గుర్తింపు కార్డు లేకుండా ఎలా ఓటు వేయాలని తర్జన భర్జన పడుతున్నారా.! అయితే టెన్షన్ పడకండీ.. మీకోసమే కేంద్ర ఎన్నికల సంఘం ఓ గుడ్ న్యూస్ అందించనుంది. ఎన్నికల సంఘం తీసుకోబోతున్న నిర్ణయం ద్వారా ఇకపై పోలింగ్ బూత్‌కు ఓటరు కార్డు తీసుకురాకుండానే ఓటు వేయొచ్చు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ఐదేళ్ల క్రిందట ప్రధానమంత్రి
నరేంద్రమోదీ లాంచ్ చేసిన ‘డిజిటల్ ఇండియా’లో భాగంగా ఇకపై ఓటరు గుర్తింపు కార్డును
డిజిటలైజ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో
జరగనున్న ఎన్నికలకు ముందే ఓటరు కార్డును డిజిటల్ ఫార్మటులోకి మార్చేయాలని
ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీని వల్ల ఓటర్లు తమ గుర్తింపు కార్డును పోలింగ్
బూత్‌ల దాకా వెంట తీసుకొచ్చే అవసరం ఉండదని తెలిపింది. క్యూఆర్ కోడ్‌ల ద్వారా
సమాచారాన్ని కార్డులో ఉంచుతామని.. దీని వల్ల విదేశాల్లో ఉన్నవారు కూడా తమ కార్డును
ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని తెలిపింది.
0 Komentar