Exim Bank Recruitment 2020 Apply For 60 Management Trainee Posts
ఇండియా ఎగ్జిమ్ బ్యాంకులో 60
జాబ్స్.. స్టైపెండ్ నెలకి రూ.40 వేలు
ఎగ్జిమ్ బ్యాంక్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 60 ఎంటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్ బ్యాంక్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 60 మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులు కార్పొరేట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్/ ప్రాజెక్ట్ ట్రేడ్/ క్రెడిట్ ఆడిట్, లా, ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హ్యూమన్ రిసోర్సెస్ తదితర విభాగాల్లో ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు ఈనెల 19 నుంచి ప్రారంభమవుతాయి. ఈనెల 31 దరఖాస్తుకు చివరితేది. పూర్తి వివరాలకు https://www.eximbankindia.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
ముఖ్య సమాచారం:
మొత్తం ఖాళీలు: 60
పోస్టు పేరు: మేనేజ్‌మెంట్
ట్రెయినీ (ఎంటీ)
విభాగాలు: కార్పొరేట్ లోన్స్ అండ్
అడ్వాన్సెస్/ ప్రాజెక్ట్ ట్రేడ్/ క్రెడిట్ ఆడిట్, లా,
ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇన్ఫర్మేషన్
టెక్నాలజీ, హ్యూమన్ రిసోర్సెస్ తదితర విభాగాల్లో ఖాళీ
ఉన్నాయి.
అర్హత:
1) మేనేజ్‌మెంట్ ట్రెయినీ
(లా): కనీసం 60% మార్కులతో లా/ ఎల్ఎల్‌బీలో గ్రాడ్యుయేషన్
ఉత్తీర్ణత.
2) మేనేజ్‌మెంట్ ట్రెయినీ
(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): కనీసం 60% మార్కులతో కంప్యూటర్
సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బీఈ/
బీటెక్/ కనీసం 60% మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్ అండ్
ఎంసీఏ ఉత్తీర్ణత.
3) మేనేజ్‌మెంట్ ట్రెయినీ
(హ్యూమన్ రిసోర్సెస్):కనీసం 60% మార్కులతో ఏదైనా పీజీ
డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు డిప్లొమా/ డిగ్రీ(హెచ్ఆర్/ పర్సనల్ మేనేజ్‌మెంట్)
ఉత్తీర్ణత.
4) మేనేజ్‌మెంట్ ట్రెయినీ
(ఇంటర్నేషనల్ ట్రేడ్): కనీసం 60% మార్కులతో ఎకనమిక్స్‌లో
పీజీ డిగ్రీ (ఇంటర్నేషనల్ ట్రేడ్/ ఫైనాన్షియల్ ఎకనమిక్స్/ ఇండస్ట్రియల్
ఎకనమిక్స్/ అగ్రికల్చరల్ ఎకనమిక్స్) ఉత్తీర్ణత.
5) మేనేజ్‌మెంట్
ట్రెయినీ(కార్పొరేట్ లోన్స్, అడ్వాన్సెస్/ ప్రాజెక్ట్
ట్రేడ్/ క్రెడిట్ ఆడిట్): ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో ఎంబీఏ/ పీజీడీబీఏ/ చార్టెడ్
అకౌంట్స్(సీఏ) ఉత్తీర్ణత.
వయసు: 01.12.2020 నాటికి అన్‌రిజర్వ్‌డ్-25 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీ-30 ఏళ్లు, ఓబీసీ-28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్షలో
చూపిన ప్రతిభ ఆధారంగా పర్సనల్ ఇంటర్వ్యూకి షార్ట్‌లిస్ట్ చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
డిసెంబర్ 19, 2020.
దరఖాస్తుకు చివరి తేది:
డిసెంబర్ 31, 2020.
వెబ్‌సైట్: https://www.eximbankindia.in/
0 Komentar