Four Eclipses In 2021, Two To Be Visible
In India
2021లో నాలుగు గ్రహణాలు
- రెండింటినే భారత్ నుంచి వీక్షించేందుకు అవకాశం
వచ్చే ఏడాది మొత్తంగా నాలుగు
గ్రహణాలు ఏర్పడనున్నట్లు మధ్యప్రదేశ్‌లోని జివాజీ అబ్జర్వేటరీ సూపరింటెండెంట్
డాక్టర్ రాజేంద్రప్రకాశ్ గుప్త్ ఆదివారం తెలిపారు. వాటిలో రెండింటిని మాత్రమే
మన దేశం నుంచి వీక్షించడం సాధ్యమవుతుందని చెప్పారు. వచ్చే ఏడాది మే 26న
తొలి గ్రహణం (సంపూర్ణ చంద్ర గ్రహణం) ఉంటుందని.. ఆ ఖగోళ పరిణామాన్ని భారత్‌లో
పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలు (సిక్కిం మినహా),
ఒడిశా నుంచి వీక్షించొచ్చని వివరించారు. జూన్ 10న వలయాకార సూర్య గ్రహణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. భారత్ నుంచి అది
కనిపించదని తెలిపారు. నవంబరు 19న ఏర్పడే పాక్షిక చంద్ర
గ్రహణాన్ని అరుణాచల్ ప్రదేశ్‌తోపాటు అసోంలోని కొన్ని ప్రాంతాల నుంచి
వీక్షించవచ్చునని వెల్లడించారు. డిసెంబరు 4న సంపూర్ణ సూర్య
గ్రహణం ఆవిష్కృతమవుతుందని, భారత్ నుంచి అది కనిపించదని
చెప్పారు. ఈ ఏడాది (2020) రెండు సూర్య గ్రహణాలు, నాలుగు చంద్ర గ్రహణాలు ఏర్పడిన సంగతి గమనార్హం.
0 Komentar