Fruit Juice Versus Whole Fruit; Which
One Should You Choose?
పండ్లు అలానే తింటే మంచిదా.. జ్యూస్
తాగితే మంచిదా..
చాలా మంది కూరగాయలు ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. మరి వీటిని ఎలా తీసుకుంటే మంచిది కూరగాయలు అలానే తీసుకోవాలా.. జ్యూస్ చేసుకుని తాగితే మంచిదా తెలుసుకోండి.
మనలో చాలా మందికి ఈ సందేహం ఉంటుంది, కూరగాయలు పచ్చిగా తింటే మంచిదా, ఉదకబెట్టి తింటే మంచిదా, లేదా జ్యూస్ చేసుకుని తాగితే మంచిదా అని. అన్నింటికీ దేని ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ దానికి ఉన్నాయి కానీ పోషకాహార నిపుణులు శరీరానికి మంచి రిజల్ట్ దేనివల్ల వస్తుందో చెబుతున్నారు.
కూరగాయల్లో ఉండే పోషకాలన్నీ వాటర్ సాల్యుబుల్ విటమిన్సే. ఈ విటమిన్స్ ఆక్సిడేషన్ వల్ల త్వరగా పోతాయి. కూరగాయలు తరుగుతున్నప్పుడూ, స్టోర్ చేస్తున్నప్పుడూ, వండుతున్నప్పుడూ విటమిన్స్ పోతూనే ఉంటాయి. నమలడం, తినడం వల్ల విటమిన్స్, మినరల్స్ నెమ్మదిగా శరీరంలోకి రిలీజ్ అవుతాయి.
అయితే, కూరగాయలని జ్యూస్ చేసుకుని ఫైబర్ తో సహా తాగితే ఎనర్జీ త్వరగా వస్తుంది, విటమిన్స్, మినరల్స్ త్వరగా అందుతాయి.
బెనిఫిట్స్..
1. ఒక కప్పు వెజిటబుల్ జ్యూసులో చాలా రకాల వెజిటబుల్స్ ఉంటాయి. అంటే, సుమారు ఐదు కప్పుల కూరగాయలని జ్యూస్ తీస్తే ఒక కప్ జ్యూస్ వస్తుంది. అందువల్లనే, ఈ జ్యూస్ తాగితే న్యూట్రియెంట్స్ హై లెవెల్ లో అందుతాయి. ఫలితంగా హ్యాపీగా హెల్దీగా ఉండగలుగుతారు.
2. కూరగాయల జ్యూస్ తాగడం వలన శరీరం తనకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ గ్రహించుకోగలదు. కూరగాయలు తిన్నప్పుడు బాడీ న్యూట్రియెంట్స్ ని ఫైబర్ నుండి విడదీసి అప్పుడు తనకి అవసరమైన న్యూట్రియెంట్స్ ని తీసుకుంటుంది. ఇది కొద్దిగా టైమ్ పట్టే ప్రాసెస్. మీరు సరిగ్గా నమలక పోయినా, మీ డైజెస్టివ్ సిస్టమ్ బలహీనం గా ఉన్నా ఈ పద్ధతిలో అంత మంచి ఫలితాలు రావు. అందుకే, ఫ్రెష్ వెజిటబుల్ జ్యూస్ ద్వారా ఈ న్యూట్రియెంట్స్ ని ఈజీగా అందుకోవచ్చు.
3. కూరగాయల నుండి వచ్చే పోషకాలన్నీ అందుకోవాలంటే మీరు రోజంతా కూరలు నములుతూనే ఉండాలి. అది కుదరదు కాబట్టే జ్యూస్ చేసి తాగేస్తే ఒక కప్ తో మనకి కావాల్సిన న్యూట్రియెంట్స్ వచ్చేస్తాయి. పొద్దున్నే పరగడుపున ఒక గ్లాస్ వెజిటబుల్ జ్యూస్ తీసుకోవడం ఒక అలవాటుగా పెట్టుకోండి.
4. వెజిటబుల్ జ్యూస్ వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది. అంటే, మీరు రోజులో తీస్కోవలసిన నీటిలో కొంత నీరు ఈ జ్యూస్ రూపం లో తీసుకుంటున్నారన్న మాట.
5. విటమిన్ డ్రింక్స్ చాలా పాప్యులర్, ఏ హెల్త్ స్టోర్ లో అయినా ఈజీగా దొరికేస్తాయి. కానీ,నాచురల్ విటమిన్స్ ఉన్నప్పుడు బాటిల్డ్ విటమిన్స్ ఎందుకు? వెజిటబుల్ జ్యూస్ లో మినరల్స్, విటమిన్స్ తో పాటూ క్లోరోఫిల్ కూడా ఉంటుంది.
6. హెయిర్ గ్రోత్ కి పాలకూర, క్యారెట్, బీట్రూట్, ఉల్లిపాయ హెల్ప్ చేస్తాయి. వీటిని జ్యూస్ చేసుకుని తాగితే జుట్టు బాగా పెరుగుతుంది.
7. ఆకుకూరలు, క్యాప్సికం వంటివి హెయిర్ లాస్ ని ప్రివెంట్ చేస్తాయి. వీటిని జ్యూస్ చేసి తాగితే మీకు కావాల్సిన ఫలితం లభిస్తుంది.
8. గుమ్మడికాయ, బ్రకోలి, చిలగడ దుంప, క్యారెట్స్ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరెంజ్ వెజిటబుల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సీ ఉన్న వెజిటబుల్స్ యొక్క జ్యూస్ తాగితే యాక్నే, పింపుల్స్ సమస్య తగ్గుతుంది.
9. టమాటా, బంగాళ దుంప, ముల్లంగి, క్యాబేజ్, క్యారెట్స్ స్కిన్ కి గ్లో ఇస్తాయి.
10. విటమిన్ సీ ఉన్న బ్రకోలీ, క్యాప్సికం, కాలీ ఫ్లవర్, టమాటా, విటమిన్ ఈ ఉన్న టర్నిప్ గ్రీన్స్, సెలీనియం వెజిటబుల్స్ చర్మం ముడతలు పడకుండా కాపాడతాయి.
ఎన్ని గ్లాసుల జ్యూస్ తాగాలి..
రోజుకి కనీసం ఒక గ్లాస్ అయినా వెజిటబుల్ జ్యూస్ తాగాలని నియమం పెట్టుకుని తాగితే మంచిది.
కూరలు తినక్కర్లేదా అయితే..
మీరు కూరలు, సలాడ్స్ మామూలుగానే ఎంజాయ్ చేయవచ్చు. వాటి దారి వాటిదే. జ్యూస్ పని జ్యూస్ దే.
మీ వెజిటబుల్ జ్యూస్ లో ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు. ఎన్ని ఎక్కువ కూరలుంటే అంత మంచిది. అయితే, జ్యూస్ చేయడానికి ముందు ఈ కూరగాయల్ని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగి అప్పుడు జ్యూస్ తీయండి. అలాగే, ఈ కూరగాయలని చిన్న చిన్న ముక్కలుగా తరిగితే జ్యూస్ తీయడం తేలికవుతుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల
ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే.
0 Komentar