Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Govt Extends Deadline for Use of FASTag till February 15

 

Govt Extends Deadline for Use of FASTag till February 15

వాహనదారులకు గుడ్‌న్యూస్.. మరోసారి ఫాస్టాగ్ గడువు పొడిగింపు

FASTag వల్ల డిజిటల్ పేమెంట్స్ కూడా పెరగనున్నాయి.. అలాగే వాహనదారులకు టోల్ ప్లాజాల వద్ద వేచిచూడాల్సిన అవసరం ఉండదు. దీంతో ఇంధనం, సమయం రెండూ ఆదాఅవుతాయి. 

సర్కార్ వాహనదారులకు తీపికబురు అందించింది. ఫాస్టాగ్ తప్పనిసరి డెడ్‌లైన్‌ను మరోసారి పొడిగించింది. జనవరి 1 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తామని ప్రకటించిన కేంద్రం.. తాజాగా, ఆ గడువును ఫిబ్రవరి 15 వరకు పెంచింది. దీంతో ఇప్పటికీ కూడా ఫాస్టాగ్ తీసుకోని వాహనదారులకు ఊరట లభించినట్టయ్యింది. ప్రస్తుతం ఫాస్టాగ్ ద్వారా 75-80 శాతం వరకు టోల్ ప్లాజా వద్ద చెల్లింపులు జరుగుతున్నాయి.. దీనిని 100 శాతానికి చేర్చాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ నిర్దేశించింది. 

టోల్ ప్లాజాల వద్ద నగదు లావాదేవీలను పూర్తిగా తగ్గించేలా, అన్ని లైన్లను ఫాస్ట్ ట్యాగ్‌‌తో అనుసంధానం చేశారు. ఒకవేళ ఫాస్టాగ్ లేకుండా ఈ లైన్‌లోకి ప్రవేశించే ఏ వాహనం అయినా సాధారణ టోల్ ఫీజు కంటే రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా వాహనదారులకు జనవరి 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానున్నాయని, ఎలక్ట్రానిక్ విధానంలో టోల్‌ వసూళ్లను మరింతగా పెంచే చర్యల్లో భాగంగా అన్ని ఫోర్‌ వీలర్లకు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేస్తున్నట్టు ఇటీవలే కేంద్రం ప్రకటించింది. 

గతంలో మినహాయింపు పొందిన పాత వాహనాలు తప్పనిసరిగా ఫాస్టాగ్‌ తీసుకోవాల్సిందేనని. . 2021 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఈ మేరకు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ సైతం జారీ చేసింది. కేంద్రం 1989 నాటి మోటారు వాహన చట్టంలో మార్పులు చేస్తూ ఈ ఉత్తర్వులు వెలువరించింది. 2017 డిసెంబర్ ‌1 కంటే ముందు కొనుగోలు చేసిన వాహనాలకూ ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. 

టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్‌ను నియంత్రించాలనే లక్ష్యంతో ఫాస్టాగ్‌ విధానాన్ని కేంద్రం 2017 నుంచి అమలు చేస్తోంది. 2019 అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా ఫాస్టాగ్‌ అమలును తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలతో పాటు పాత వాహనాలకు ఫాస్టాగ్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే తాజా ఉత్తర్వులతో వచ్చే ఏడాది నుంచి అన్ని నాలుగు చక్రాల వాహనాలకూ ఫాస్టాగ్‌ తప్పనిసరైంది. 

ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ రెన్యువల్‌ చేయించాలంటే ఫాస్టాగ్‌ తప్పనిసరి అని నిబంధనల్లో పేర్కొన్నారు. అలాగే థర్డ్‌ పార్టీ బీమా తీసుకోవాలన్నా ఫాస్టాగ్‌ తీసుకోవాలన్న నిబంధనను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేయనున్నారు. 

బ్యాంకుకు వెళ్లి ఫాస్టాగ్ తీసుకోవచ్చు. ఫాస్టాగ్‌లను యూపీఐ, మై ఫాస్టాగ్ యాప్, నెట్ బ్యాంకింగ్, పేటీఎం వంటి వాటితో రీచార్జ్ చేసుకోవచ్చు. ఫాస్టాగ్ వాలిడిటీ ఐదేళ్లు ఉంటుంది. ఒక్కసారి ఫాస్టాగ్ తీసుకుంటే ఐదేళ్ల అదే పనిచేస్తుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags