Group-1 Main Exam
Question Paper through Tab
ట్యాబ్‌లోనే గ్రూప్-1 ప్రధాన పరీక్షల ప్రశ్నపత్రం
ఈ నెల 14 నుంచి జరిగే గ్రూప్-1
ప్రధాన పరీక్షలను ట్యాబ్‌ల ఆధారంగా నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
ప్రశ్నలు ట్యాబ్‌లోనే ఉంటాయని వెల్లడించింది. ఈ ట్యాబ్‌లను పరీక్ష హాలులోనే
అభ్యర్థులకు ఇస్తారు. జవాబులు రాసేందుకు బుక్‌లెట్ ఇస్తారు. పరీక్ష ప్రారంభానికి
మూడు నిమిషాల ముందు ప్రశ్నలు చూసేందుకు ఇన్విజిలేటర్లు పాస్‌వర్డ్ ప్రకటిస్తారు.
దీని ఆధారంగా అభ్యర్థి తన హాల్‌టికెట్ నంబరును నమోదుచేస్తే ప్రశ్నపత్రం వస్తుంది.
ప్రశ్నలను జూమ్ చేసి చూసుకునే వెసులుబాటు ఉంటుంది. ట్యాబ్ 5 గంటల పాటు పనిచేసేలా బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ట్యాబ్ ఎలా
పనిచేస్తుందనే వీడియో లింక్‌ను ఇప్పటికే వెబ్‌సైట్‌లో ఉంచారు. పరీక్షకేంద్రాల
దగ్గర ప్రత్యేక సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు ప్రధాన పరీక్షలు జరగనున్నాయి.
పరీక్ష ముగిసిన తర్వాత ప్రశ్నపత్రాన్ని వెబ్‌సైట్‌లో ఉంచుతారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ
గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
0 Komentar