IDBI Recruitment 2021: Apply for 134
Specialist Officer Posts
ఐడీబీఐలో 134 జాబ్స్.. రూ.60 వేల వరకూ జీతం
ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న
ఇండస్ట్రియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ).. 134 స్పెషలిస్ట్ కేడర్
ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిలో డీజీఎం, ఏజీఎం, మేనేజర్, అసిస్టెంట్
మేనేజర్ పోస్టులున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు
చేసుకోవాలి. డిసెంబర్ 24 నుంచి దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభమవుతుంది. జనవరి 7 దరఖాస్తులకు చివరితేది.
పూర్తి వివరాలకు https://www.idbibank.in/index.asp వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 134
డీజీఎం (గ్రేడ్ డి)- 11
ఏజీఎం (గ్రేడ్ సి)- 52
మేనేజర్ (గ్రేడ్ బి)- 62
అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ ఏ)- 09
ఎంపిక విధానం:
ప్రిలిమినరీ స్క్రీనింగ్ ఆధారంగా
అభ్యర్థుల తదుపరి ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఆన్‌లైన్‌లో పంపించిన దరఖాస్తుల్లోని
విద్యార్హతలు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా
అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారిని గ్రూప్
డిస్కషన్(జీడీ)/ పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు.
పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ప్రక్రియ ఉంటుంది. దీన్ని 100 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో జనరల్ అభ్యర్థులకు 50, ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పీడబ్ల్యూడీలకు 45 కనీస అర్హత మార్కులుగా కేటాయించారు. జీడీ/ పర్సనల్ ఇంటర్వ్యూలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు బ్యాంక్ నిబంధనల ప్రకారం మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.
ముఖ్య సమాచారం:
అర్హత: పోస్టునులను బట్టి కనీసం
60% మార్కులతో సంబంధిత సబ్జెక్టు్ల్లో గ్రాడ్యుయేషన్, బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు
సంబంధిత పని నైపుణ్యాలు, అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఇతరులకు రూ.700, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.150.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
డిసెంబర్ 24, 2020.
దరఖాస్తుకు చివరి తేది: జనవరి 07, 2021.
వెబ్‌సైట్: https://www.idbibank.in/
0 Komentar