Indian Navy Recruitment 2021 for
Scientific Assistant Posts
నేవీలో సైంటిఫిక్ అసిస్టెంట్
పోస్టులు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ముంబయిలోని వెస్టర్న్ నావల్ కమాండ్ గ్రూప్-బి, నాన్ మినిస్టీరియల్, నాన్ గెజిటెడ్ సివిలియన్ పర్సనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
సైంటిఫిక్ అసిస్టెంట్
మొత్తం ఖాళీలుఐ 14
అర్హత: ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ ఎలక్ట్రానిక్స్/ ఓషనోగ్రఫీ సబ్జెక్టుల్లో బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కింద సూచించిన విభాగాల్లో రెండేళ్ల అనుభవం ఉండాలి.
మెటీరియల్ అనాలసిస్/ టెస్టింగ్ టెక్నిక్స్/ మెషినరీ నాయిస్, వైబ్రేషన్ మూవ్‌మెంట్స్ అనాలసిస్, రిడక్షన్ టెక్నిక్స్/ కొర్రోజియన్ అనాలసిస్, మిటిగేషన్ టెక్నిక్స్.
వయసు: 30 ఏళ్లు మించకూడదు. గరిష్ఠ వయసులో ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: విద్యార్హతలు, మెరిట్, ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్ ఉంటుంది. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు రాతపరీక్ష నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ఆబ్జెక్టివ్ టైప్ రాతపరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. దీనిలోని సబ్జెక్టులు, వాటి మార్కుల వివరాలు కింది విధంగా..
1) జనరల్ ఇంగ్లిష్ - 10 మార్కులు
2) న్యూమరికల్ ఆప్టిట్యూడ్ - 10 మార్కులు
3) జనరల్ ఇంటలిజెన్స్/ అవేర్‌నెస్ అండ్ రీజనింగ్ - 10 మార్కులు
4) సైన్స్ అండ్ టెక్నాలజీ - 20 మార్కులు
5) సంబంధిత ట్రేడ్/ ఫీల్డ్‌లో అవేర్‌నెస్ - 50 మార్కులు
రాతపరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు ప్రొవిజనల్(తాత్కాలిక) నియామకపత్రం ఇస్తారు. వారిని తదుపరి ఎంపిక ప్రక్రియలో భాగంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. విద్యార్హతలు, ఇతర సర్టిఫికెట్లు అన్ని స్క్రుటినైజ్ చేశాక ఎంపికైన వారికి పోస్టు/ నావల్ వెబ్‌సైట్ ద్వారా తెలియజేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: ఎంప్లాయిమెంట్ న్యూస్(2020 డిసెంబరు 26-జనవ 1)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా: ఫ‌్లాగ్ ఆఫీసర్ కమాండింగ్
ఇన్ చీఫ్,
హెడ్‌క్వార్టర్స్, వెస్టర్న్ నావల్ కమాండ్,
బళ్లార్డ్ ఎస్టేట్, టైగర్ గేట్ దగ్గర,
ముంబయి-400001.
0 Komentar