Indian Railways RRB mega recruitment drive
from Dec 15 to fill 1.4 lakh vacancies
ఈ నెల 15
నుంచి రైల్వే ఉద్యోగాల భర్తీ పరీక్షలు -1.4 లక్షల పోస్టులకు 2.44 కోట్ల మంది దరఖాస్తు
రైల్వే శాఖలో 1.4 లక్షల పోస్టుల భర్తీకి డిసెంబరు 15 నుంచి పరీక్షలు మొదలవుతాయని రైల్వే బోర్డు మానవ వనరుల విభాగం డైరెక్టర్ జనరల్ ఆనంద్‌సింగ్ ఖాతీ వెల్లడించారు. గత ఏడాది జారీ చేసిన మూడు నోటిఫికేషన్ల పరీక్షలు ఇందులో ఉన్నాయన్నారు. ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఉద్యోగాల కోసం 2.44 కోట్ల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబరు 15 నుంచి ప్రారంభమయ్యే తొలి దశ పరీక్షల కేంద్రాల వివరాలను అభ్యర్థులకు వ్యక్తిగతంగా ఎస్‌ఎంఎస్, ఈమెయిల్ ద్వారా పంపుతారు. ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల తేదీ, షిఫ్ట్ వివరాలు ఉంటాయి. పరీక్షకు నాలుగు రోజుల ముందు ఈ-కాల్ లెటర్‌ను ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తదుపరి దశల పరీక్షలకు సంబంధించిన వివరాలను సమయానుకూలంగా వెల్లడిస్తూ పోతారు. ‘‘మహిళలు, దివ్యాంగులకు పూర్తిగా, మిగతా వారికి సాధ్యమైనంత మేరకు ఏ రాష్ట్రం వారికి ఆ రాష్ట్రాల్లోనే పరీక్ష కేంద్రాలు కేటాయించాం. అవసరమైన చోట్ల పరీక్షార్థుల కోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నాం. కంప్యూటర్ ఆధారిత పరీక్ష గురించి ముందే అవగాహన పెంచుకోవడానికి వీలుగా పరీక్ష కంటే ముందే మాక్‌టెస్ట్ లింక్‌ను అభ్యర్థులకు పంపుతున్నాం. ఈ నియామకాలకు ఇంటర్వ్యూలు ఉండవు. కేవలం పరీక్షల్లో కనిపించిన మెరిట్ ప్రాతిపదికనే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ప్రతి పరీక్షకు ముందు అభ్యర్థుల వేలిముద్రలు, ఫొటో తీసుకుంటారు. స్క్రీన్లపై అభ్యర్థుల ఫొటోలు ప్రదర్శితమవుతాయి. సీసీ టీవీ నిఘా, రియల్ కమాండ్‌సెంటర్ మానిటరింగ్ ఉంటుంది. ప్రతి అభ్యర్థి గురించి పూర్తిస్థాయిలో ఆడిట్ ట్రయల్స్ నిర్వహిస్తాం. కొవిడ్ నేపథ్యంలో ప్రతి అభ్యర్థినీ థర్మల్ గన్స్ ద్వారా పరీక్షించాకే లోపలికి పంపుతాం. నిర్ణీత ప్రమాణాలకు మించి ఉష్ణోగ్రతలు ఉన్నవారిని పరీక్షలకు అనుమతించరు. వారికి మళ్లీ ఎప్పుడు పరీక్ష నిర్వహించేదీ తర్వాత ఈమెయిల్, మొబైల్ ద్వారా సమాచారం అందిస్తాం. ప్రతి అభ్యర్థీ మాస్క్ ధరించాలి. సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి’’ అని ఆనంద్‌సింగ్ ఖాతీ వివరించారు.
మూడు రకాల నోటిఫికేషన్లకు
సంబంధించిన పరీక్షల వివరాలు
డిసెంబర్ 15
నుంచి 18 వరకు
ఐసోలేటెడ్ అండ్ మినిస్టీరియల్
కేటగిరీస్ అంటే స్టేనో, టీచర్ పోస్టులకు 2020
డిసెంబర్ 15 నుంచి 18 వరకు పరీక్షలు
జరగనున్నాయి. మొత్తం 1,663 పోస్టులకు 1.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
డిసెంబర్ 28
నుంచి 2021 మార్చి చివరి వారం వరకు
ఎన్‌టీపీసీ పోస్టులకు అంటే స్టేషన్
మాస్టర్,
గార్డ్స్, ఆఫీస్ క్లర్క్స్, కమర్షియల్ క్లర్క్ పోస్టులకు 2020 డిసెంబర్ 28 నుంచి 2021 మార్చి చివరి వారం వరకు దశలవారీగా
పరీక్షలు జరుగుతాయి. మొత్తం 35,208 పోస్టులకు 1 కోటీ 26 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేశారు.
2021 ఏప్రిల్ నుంచి 2021 జూన్
లెవెల్ 1 పోస్టులకు
అంటే ట్రాక్ మెయింటైనర్స్, పాయింట్స్ మ్యాన్ లాంటి లెవెల్-1
ఉద్యోగాలకు 2021 ఏప్రిల్ నుంచి 2021 జూన్ మధ్య కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరగనుంది. మొత్తం 1,03,769 పోస్టులకు 1.15 కోట్ల మంది అభ్యర్థులు దరఖాస్తు
చేసుకున్నారు.
How to apply it
ReplyDeleteFor the above posts applications closed. The exam dates announced.
DeleteYou can apply for the below posts.
https://www.tlm4all.com/2020/12/rrc-hubli-recruitment-2020-swr-apprentice-posts.html
Check 'Job notifications' label in our website
Delete