India's Covid Cases Pass 1 Crore; 95% Recovery Rate
కోటి దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ కేసులు కోటి మార్కును దాటేశాయి. అగ్రదేశం అమెరికా తరవాత ఈ స్థాయిలో కేసులు నమోదైంది భారత్‌లోనే. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..ప్రస్తుతం దేశంలో 1,00,04,599 మందికి కరోనా వైరస్ సోకింది. శుక్రవారం 11,71,868 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా..25,152 మందికి పాజిటివ్‌గా తేలింది. కేసులు కోటి మార్కును దాటినప్పటికీ..గత కొద్ది రోజులుగా కేసుల్లో భారీ పెరుగుదల లేకపోవడం ఊరట కలిగించే అంశం.
ఇక, క్రియాశీల
కేసుల్లోనూ రోజురోజుకూ తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో 3,08,751 క్రియాశీల కేసులుండగా..ఆ రేటు 3.09శాతానికి
చేరింది. అలాగే ఇప్పటివరకు 95,50,712 మంది వైరస్ నుంచి
కోలుకొని, ఇళ్లకు చేరుకున్నారు. రికవరీ రేటు కూడా 95 శాతంపైనే కొనసాగుతోంది. మరోవైపు, గత ఏడు రోజులుగా
మరణాల సంఖ్య 400 దిగువనే నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో 347 మంది మరణించగా..మొత్తం మరణాల సంఖ్య 1,45,136కు చేరింది. ఐసీఎంఆర్ లెక్కల ప్రకారం..నిన్నటితో నిర్ధారణ పరీక్షల సంఖ్య 16 కోట్లకు చేరింది. కాగా, జనవరి 30న కేరళలో మొదటి కేసు నమోదైన దగ్గరి నుంచి, మన దేశంలో
వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. అయితే, అధికారుల సూచనలు,
ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలతో వైరస్ వ్యాప్తి అదుపులో ఉంది.
మరోవైపు, టీకాకు అనుమతి లభిస్తుందనే వార్తలు
వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగా కేంద్రం కూడా కార్యాచరణను సిద్ధం చేస్తోంది.
0 Komentar