IRCTC Latest News: Now You Can Check PNR
Status & Other Details of Train Journey on WhatsApp
మీరు రైల్వే ప్రయాణం ఎక్కువగా చేస్తుంటారా? అయితే మీకు తీపికబురు. ట్రైన్ ప్యాసింజర్లకు కొత్త సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. రైలోఫీ అనే సంస్థ తాజాగా కొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో ట్రైన్ జర్నీ చేసే వారికి చాలా బెనిఫిట్ కలుగనుంది.
రియల్‌టైమ్ పీఎన్ఆర్ స్టేటస్ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ట్రైన్ ఎక్కడ ఉందో కూడా సులభంగానే తెలుసుకునే ఛాన్స్ ఉంది. అది కూడా వాట్సాప్ ద్వారానే ఈ సేవలు పొందొచ్చు. ఇంకా ఎన్నో రకాల సర్వీసులు లభిస్తాయి. లైవ్ ట్రైన్ స్టేటస్, ప్రీవియస్ రైల్వే స్టేషన్, అప్‌కమింగ్ రైల్వే స్టేషన్, పీఎన్ఆర్ స్టేటస్ వంటి సమాచారం అంతా మీ అరచేతిలోనే ఉంటుంది.
రైల్వే ప్రయాణికులకు వారి వాట్సాప్ ద్వారా పీఎన్ఆర్ స్టేటస్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అలర్ట్స్ వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా ట్రైన్ ఏమైనా ఆలస్యమౌతోందా? అనే విషయం కూడా తెలుసుకోవచ్చు. దీని కోసం వాట్సాప్ యూజర్లు వారి యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి.
తర్వాత +91-9881193322 నెంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు వాట్సాప్‌లోకి వెళ్లి
మీ 10 అంకెల పీఎన్ఆర్ నెంబర్‌ను ఎంటర్ చేసి సెండ్ చేయాలి.
తర్వాత మీకు ఎప్పటికప్పుడు రియల్‌టైమ్‌లో అప్‌డేట్స్ వస్తూనే ఉంటాయి. ట్రైన్ జర్నీ
చేసే వారికి ఈ సర్వీసుల వల్ల చాల వరకు ఊరట కలుగనుంది.
0 Komentar