JEE Main 2021 Dates Not Finalised Yet:
Education Ministry
‘జేఈఈ’ ప్రకటనలో గందరగోళం
- షెడ్యూల్ ప్రకటించిన తర్వాత వెనక్కి తీసుకున్న ఎన్టీఏ
తేదీలు ఇంకా ఖరారు చేయలేదు
ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ వినీత్ జోషి
జేఈఈ-2021 పరీక్ష షెడ్యూల్‌పై గందరగోళం నెలకొంది. జేఈఈ మెయిన్ తొలివిడత పరీక్షను ఫిబ్రవరి 22-25వరకు నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మంగళవారం మధ్యాహ్నం షెడ్యూల్ ప్రకటించింది. దరఖాస్తు ప్రక్రియ మంగళవారం నుంచే ప్రారంభమైందని, జనవరి-15వరకు చేసుకోవచ్చని పేర్కొంది. ఈసారి 13 భాషల్లో, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నాలుగుసార్లు పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. పరీక్షల నిర్వహణ నిబంధనలకు సంబంధించి 50 పేజీల పుస్తకాన్ని కూడా విడుదల చేసింది.
కానీ, మంగళవారం
రాత్రి అకస్మాత్తుగా అధికారిక వెబ్‌సైట్ నుంచి షెడ్యూల్‌ను ఎన్‌టీఏ తొలగించింది.
దీంతో ఈ పరీక్షపై గందరగోళం నెలకొంది. మధ్యాహ్నం విడుదలచేసిన షెడ్యూల్ నిజం కాదని
ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ వినీత్ జోషి మంగళవారం రాత్రి ఓ ఆంగ్ల పత్రికకు
వెల్లడించారు. తేదీలను త్వరలో వెల్లడిస్తామని అన్నారు.
0 Komentar