JEE Main 2021 Dates Announced: First
Attempt from February 23 to 26
జేఈఈ మెయిన్-2021 నూతన షెడ్యూల్ విడుదల
ఫిబ్రవరి 23
నుంచి జేఈఈ మెయిన్
షెడ్యూల్‌ను వెల్లడించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్
దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థలైన
ఐఐటీలు,
ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్-2021 ఎంట్రన్స్ పరీక్ష నూతన షెడ్యూల్‌ను తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి
రమేశ్ పోఖ్రియాల్ డిసెంబరు 16న ప్రకటించారు. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయని
ట్విటర్ ద్వారా వెల్లడించారు. అలాగే మొత్తం నాలుగు సార్లు జేఈఈ మెయిన్ పరీక్షలు
నిర్వహించనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. తొలిసారి ఫిబ్రవరిలో నిర్వహించనుండగా..
మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మరో మూడు
సార్లు పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు.
పరీక్షలు నిర్వహించిన అనంతరం నాలుగైదు రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. మంగళవారం జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసి.. కాసేపటికే వెబ్‌సైట్ నుంచి తొలగించిన విషయం తెలిసిందే.
తెలుగు, ఇంగ్లీష్,
హిందీ, బెంగాలీ, గుజరాతీ,
అస్సామీ, కన్నడ, మరాఠీ,
పంజాబ్, తమిళ్, ఉర్దూ,
ఒడియా, మలయాళం..ఇలా మొత్తం 13 భాషల్లో ఈ పరీక్ష జరగనుందని మంత్రి తెలిపారు. అలాగే ఈ సారి పరీక్ష
విధానంలో కూడా మార్పులు చేశారు. 90 ప్రశ్నలకు గాను 75 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని, లేదంటే
కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్
విభాగాల్లో 30 ప్రశ్నలకు 25 ప్రశ్నలకు
సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఎవరైనా విద్యార్థి నాలుగుసార్లూ పరీక్షకు హాజరైతే
ఎందులో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)
పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు.
దరఖాస్తు ఫారంలను Official Website డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.
0 Komentar