జేఈఈ మెయిన్స్ చాయిస్ ప్రశ్నలకు, మైనస్ మార్కుల్లేవ్ - ఎన్టీఏ
ఇంజినీరింగ్ విద్య ప్రవేశాలకు
నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష విధానాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం
విడుదల చేసింది. బీటెక్, బీఆర్క్ బీ ప్లానింగ్ పేపర్ల ప్యాటర్న్ ను
ప్రకటించింది. 2021 జేఈఈ మెయిన్స్ ప్రశ్నపత్రంలో మొత్తం 90 ప్రశ్నలుంటాయి. వాటిలో 75 ప్రశ్నలకు అభ్యర్థులు'
సమాధానాలు రాయాల్సి ఉంటుంది. గణితం, ఫిజిక్స్,
కెమిస్ట్రీ విభాగాల నుంచి చొప్పున ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 25 ప్రశ్నలకు జవాబాలు రాయాల్సి ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ లో రెండు విభాగాలు
ఉంటాయి. సెక్షన్-ఎలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు, సెక్షన్
-బిలో న్యూమరికల్ వ్యాల్యూ ఆన్సర్లుంటాయి. పది ప్రశ్నల్లో ఐదింటికి జవాబులు
రాయాల్సి ఉంటుంది. సెక్షన్ బికి మైనస్ మార్కులు ఉండవు. బీటెక్ అభ్యర్థులకు పేపర్-1,
బీఆర్క్, బి.ప్లానింగ్ అభ్యర్థులకు పేపర్-2 పేపర్లుగా విభజించారు. పేపర్ -1 పరీక్షను 300 మార్కులకు, పేపర్-2400
మార్కులకు నిర్వహిస్తారు. మొత్తంగా నాలుగు విడతల్లో మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి.
తొలి విడత పరీక్ష ఫిబ్రవరి 23-26 మధ్య నిర్వహిస్తారు. మిగతా
మూడు విడతల పరీక్షలు మార్చి, ఏప్రిల్, మే
నెలల్లో జరుగుతాయి. దరఖాస్తుల ప్రక్రియకు జనవరి 15ను
తుదిగడువుగా ఎన్టీఏ ప్రకటించిన సంగతి తెలిసిందే..
మైనస్ మార్కులు
జేఈఈ మెయిన్స్ లో మైనస్ మార్కుల
విధానం అమలవుతుందని ఎన్టిఏ పేర్కొంది. సరైన జవాబుకు నాలుగు మార్కులు కేటాయిస్తారు.
తప్పుగా రాసిన జవాబుకు ఒక మార్కు చొప్పున స్కోరింగ్ తగ్గిస్తారు. చాయిస్ ప్రశ్నలకు
రాసే జవాబుల్లో తప్పొప్పులకు మైనస్ మార్కులు ఉండవు. సిలబస్ ను తగ్గించినా, తగ్గించక
పోయినా బోర్డుల్లోని విద్యార్థులు పరీక్ష రాసే విధంగా ఈ నమూనా సిద్ధం చేశామని
కేంద్ర విద్యాశాఖ మంత్రిపోభ్రియాల్ తెలిపారు.బీటెక్ కంప్యూటర్ విద్యార్థుల మధ్య టై
అయితే, గణితంలో ఎన్టీఏ స్కోరు మొదటగా పరగిణిం చబడుతుంది. ఆ
తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీస్కోరు, ఆ
తర్వాత నెగెటివ్ మార్కులను పరిగణిస్తారు. బీఆర్క్ లో టై అయితే, తొలుత గణిత స్కోరు, ఆ తర్వాత ఆప్టిట్యూడ్, డ్రాయింగ్ పరీక్షలను పరిశీలించి ర్యాంకులు ఇస్తారు.
CLICK HERE FOR COMPLETE JEE MAINS-2021 BULLETIN
0 Komentar