Jio: All Calls from Jio To Other Networks in
India To Be Free from Jan 1
జియో గుడ్‌న్యూస్ - మళ్లీ ఉచిత వాయిస్ కాల్స్ సేవలు
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో వినియోగదారులకు శుభవార్త చెప్పింది. కొత్త ఏడాదిలో మళ్లీ ఉచిత వాయిస్ కాల్స్ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. నూతన సంవత్సరం నుంచి ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చని వెల్లడించింది. ‘ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జీలు(ఐయూసీ) విధానం రద్దయిన తర్వాత మళ్లీ ఉచిత వాయిస్ కాల్స్ సేవలను పునరుద్ధరిస్తామని గతంలో చెప్పాం. ఆ హామీకి మేం కట్టుబడి ఉన్నాం. ఇకపై జనవరి 1, 2021 నుంచి ఏ నెట్‌వర్క్‌కైనా జియో ద్వారా ఉచిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు’ అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఒక నెట్‌వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు కాల్‌చేసినప్పుడు కాల్ అందుకున్న నెట్‌వర్క్‌కు కాల్ చేసిన నెట్‌వర్క్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దీన్నే ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జెస్ అంటారు. ప్రస్తుతం ఇది నిమిషానికి 6 పైసలుగా ఉంది. అయితే జీవితకాలం ఉచిత వాయిస్ కాల్స్ అందిస్తామనే నినాదంతో మార్కెట్లోకి వచ్చిన రిలయన్స్ జియో.. ఐయూసీ విధానాన్ని తొలగించాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో 2020 ఈ విధానాన్ని జనవరి 1 నుంచి తొలగించడానికి కేంద్రం గతంలో సమ్మతించింది.
అయితే ఎయిర్‌టెల్, వొడాఫోన్
ఐడియా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో ఐయూసీ అమలును మరింతకాలం పొడగిస్తూ 2019 సెప్టెంబరులో ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో జియోపై అదనపు భారం
పడటంతో కంపెనీ కూడా ఇతర నెట్‌వర్క్‌లకు చేసే వాయిస్ కాల్స్‌పై ఛార్జీలు
విధించింది. అయితే ఐయూసీ అమల్లో ఉన్నంతకాలమే ఛార్జీలు వసూలు చేస్తామని జియో
అప్పట్లోనే స్పష్టం చేసింది. తాజాగా నేటితో ఈ ఐయూసీ అమలు గడువు ముగుస్తుండటంతో
జియో మళ్లీ ఉచిత వాయిస్ కాల్స్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది.
టెలికాం రెగ్యులేటర్ ఆదేశాల ప్రకారమే ఉచిత కాల్స్ సేవలను పునరుద్ధరిస్తున్నట్లు
కంపెనీ వెల్లడించింది.
0 Komentar