Jupiter-Saturn The Great Conjunction Today
After 397 Years, How To Watch India
నేడు ఆకాశంలో మహా అద్భుతం.. 800 ఏళ్ల తర్వాత ఆ గ్రహాలు రాత్రివేళ సంయోగం
ఆకాశంలో తరచూ ఏదో ఓ అద్భుతం జరుగుతుంటుంది. భూమిపై ఉన్న జీవులకు వాటిలో కొన్నింటిని చూసే అవకాశం ఉంటుంది. అలాంటి మహా అద్భుతం నేడు ఆవిష్కృతం కాబోతోంది.
ఈ ఏడాది ఖగోళ అద్భుతాల పరంపర కొనసాగుతోంది. దాదాపు నాలుగు శతాబ్దాల తర్వాత ఆకాశంలో జరిగే అద్భుతానికి 2020 ఏడాది సాక్షీభూతంగా నిలవనుంది. నేడు డిసెంబరు 21న గురు-శని గ్రహాలు అతి సమీపంగా వచ్చి అత్యంత ప్రకాశవంతంగా కనువిందు చేయనున్నాయి. క్రీ.శ.1623 తర్వాత ఈ రెండు గ్రహాలు ఇంత దగ్గరగా రావడం ఇదే తొలిసారని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దీంతో ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించేందుకు ప్రపంచమంతా ఆసక్తిచూపుతోంది.
భూమి నుంచి చూస్తే ఏవైనా రెండు గ్రహాలు అతి దగ్గరగా సమీపించే దృశ్యాన్ని కంజక్షన్‌గా పిలుస్తారు. ఇలా గురు-శని గ్రహాలు కనిపించడాన్ని మాత్రం గ్రేట్ కంజక్షన్‌గా అభివర్ణిస్తారు. ఆ సమయంలో భూమి నుంచి చూస్తున్నప్పుడు.. రెండు గ్రహాలు 0.1 డిగ్రీల మేర మాత్రమే దూరంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చివరిసారిగా ఇవి క్రీ.శ1623లో ఇంత దగ్గరగా రాగా.. ఇలాంటి సంయోగం రాత్రివేళ జరగడం.. 800 ఏళ్లలో ఇదే తొలిసారి.
సోమవారం అత్యంత సమీపానికి
వచ్చినప్పుడు వీటి మధ్య దూరం దాదాపు 73.5కోట్ల కిలోమీటర్ల
ఉంటుంది. ఆ సమయంలో గురు గ్రహం ముందుభాగం భూమికి 89 కోట్ల
కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మళ్లీ ఈ గ్రహాలు 2080 మార్చి 15న ఈ స్థాయిలో చేరువగా వస్తాయి.
మిగతా గ్రహాలకు భిన్నంగా గురుడు, శని
‘కలయిక’ చాలా అరుదు. సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహం బృహస్పతి (గురు) సూర్యుని
నుంచి ఐదోది. దాని తర్వాత రెండో అతిపెద్ద గ్రహం శని.. సూర్యుని నుంచి ఆరోది.
0 Komentar