Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jupiter-Saturn The Great Conjunction on December 21

 

Jupiter-Saturn The Great Conjunction on December 21

ఈ రోజు ఆకాశంలో వింత.. మిస్సయితే మళ్లీ 2080లోనే..

ఇప్పుడు కంజక్షన్ జరిగాక.. దీన్ని మళ్లీ చూడాలంటే 2080వ సంత్సరం వరకూ ఆగాల్సి ఉంటుందని నిపుణులు వివరించారు. 2080 మార్చి 15న గురు, శని గ్రహాలు ఇలా అత్యంత స‌మీపానికి రానున్నాయి. 

ఆకాశంలో ఓ అరుదైన ఖ‌గోళ వింత ఈ రోజు కనువిందు చేయనుంది. గురు, శ‌ని గ్రహాలు (జ్యుపిటర్, శాటర్న్) ఒక‌దానికొకటి స‌మీపంలోకి రానున్నాయని నిపుణులు చెప్పారు. ఇలా ఈ రెండూ క‌లిపి భూమిపై ఉన్నవారికి ఆకాశంలో ఓ ప్రకాశవంతమైన న‌క్షత్రంలా క‌నిపించ‌నున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ పరిణామం చివ‌రిసారిగా 1623లో జరిగింది. చివరిసారిగా అప్పుడే ఈ రెండు గ్రహాలు ఇంత స‌మీపానికి వ‌చ్చాయి. అంటే 397 ఏళ్ల త‌ర్వాత మ‌రోసారి ఆ అద్భుతం జ‌ర‌గ‌బోతుందని బిర్లా ప్లానెటేరియం డైరెక్టర్ దేబి ప్రసాద్ దువారీ చెప్పారు. దీనిని గ్రేట్ కంజంక్షన్‌గా పిలుస్తార‌ని తెలిపారు. 

ఏవైనా రెండు ఖ‌గోళ గ్రహాలు భూమి నుంచి చూసిన‌ప్పుడు రెండూ అత్యంత స‌మీపంగా క‌నిపిస్తే దానిని కంజంక్షన్ అంటార‌ని తెలిపారు. ఇదే గురు, శ‌ని గ్రహాల విష‌యంలో ది గ్రేట్ కంజంక్షన్ అంటార‌ని ఆయ‌న చెప్పారు. ఇప్పుడు కంజక్షన్ జరిగాక.. దీన్ని మళ్లీ చూడాలంటే 2080వ సంత్సరం వరకూ ఆగాల్సి ఉంటుందని వివరించారు. 2080 మార్చి 15న గురు, శని గ్రహాలు ఇలా అత్యంత స‌మీపానికి రానున్నాయి. 

ఈ రోజు (డిసెంబ‌ర్ 21) న రాత్రిపూట ఈ రెండు గ్రహాల మ‌ధ్య దూరం కేవలం 73.5 కోట్ల కిలోమీట‌ర్లుగా ఉంటుంద‌ని దేబి ప్రసాద్ తెలిపారు. ఆ రోజు సూర్యస్తమ‌యం త‌ర్వాత మన దేశంలోని చాలా న‌గ‌రాల్లో ఈ అద్భుతమైన కంజంక్షన్ క‌నిపిస్తుంద‌ని చెప్పారు. ఆ రోజు వ‌ర‌కూ ప్రతి రోజూ ఈ రెండు గ్రహాల మ‌ధ్య దూరం క్రమంగా తగ్గుతూ వస్తుందని వివరించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags