MBBS, BDS and Pharmacy Counselling update
విడివిడిగా ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్ - డిసెంబర్ 8 నుంచి ఫార్మసీ కౌన్సెలింగ్
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం విడివిడిగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ప్రకటించిన తేదీల్లో విద్యార్థులు ప్రవేశాల కోసం ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాలి. సీటు కేటాయించిన కళాశాలల్లో చేరకుంటే.. తదుపరి కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అవకాశాన్ని ఉండదు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలోని పాలిటెక్నిక్
కళాశాలల్లో ఫార్మసీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను
కన్వీనర్ ఎం.ఎం.నాయక్ విడుదల చేశారు. ప్రాసెసింగ్ రుసుము చెల్లింపునకు ఈ నెల 8
నుంచి 10 వరకు, ధ్రువపత్రాల పరిశీలనకు 9 నుంచి 10 వరకు, సీట్లు,
కళాశాలల ఎంపికకు ఐచ్ఛికాలు నమోదు చేసుకునేందుకు 8 నుంచి 10 వరకు అవకాశం కల్పించారు. 12న సీట్లను కేటాయించనున్నారు.
0 Komentar