Nepal announces newly-measured height of
Mount Everest at 88483.86 meters
ఎవరెస్ట్ పర్వతం ఎత్తు పెరిగిందట!
ఎవరెస్టు పర్వతం ఎత్తు పెరగడం
ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? ఔను, నిజం..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతంగా పేరొందిన ఎవరెస్టు పర్వతం ఎత్తు పెరిగింది. ఈ
విషయాన్ని స్వయంగా నేపాల్, చైనా ప్రభుత్వాలే వెల్లడించాయి. ఈ
ఆరు దశాబ్దాల్లో ఎవరెస్టు పర్వతం ఎత్తు సుమారు 86 సెంటీ మీటర్లకు పెరిగిందట.
1954లో భారత ప్రభుత్వం ఎవరెస్టు ఎత్తును కొలిచింది. ఈ సందర్భంగా దాని ఎత్తు.. 8,848 మీటర్లు ఉన్నట్లు తెలిపింది. అయితే, తాజా
కొలతల్లో ఆ ఎత్తు 8,848.86 మీటర్లుగా నమోదైంది. నేపాల్
భూకంపం తర్వాత ఎవరెస్టు ఎత్తు తగ్గి ఉండవచ్చని భావించారు. ఈ సందర్భంగా చైనా సాయంతో
నేపాల్ మరోసారి ఎవరెస్టు ఎత్తును కొలిచింది. ఫలితాల్లో ఎవరెస్టు ఎత్తు తగ్గకపోగా..
86 సెంటీ మీటర్లు పెరిగింది. సాధారణ పర్వతాలతో పోల్చితే ఎవరెస్టు పర్వతం చాలా
భిన్నమైనది. హిమాలయాల్లో ఉన్న ఈ ఎవరెస్ట్ పర్వతానికి సంబంధించిన శిలాఫలకాలు స్వల్పంగా
కదులుతుంటాయి. భూకంపాల సమయంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా భారత ఫలకం
యురేసియన్ ఫలకంలోచి చొచ్చుకెళ్లేప్పుడు ఏర్పడే ఘర్షణ వల్ల ఇలాంటివి జరుగుతాయి.
అయితే, ఇది వెంట వెంటనే జరిగే ప్రక్రియ కాదు. ఒక సెంటీ మీటరు
మార్పు జరిగేందుకు అనేక సంవత్సరాల సమయం పడుతుంది.
0 Komentar