New Rule for Cheque Payments from
January 1, All You Need to Know
మీకు బ్యాంకులో ఖాతా ఉందా..? చెక్కుల ద్వారా తరచుగా లావాదేవీలు జరుపుతుంటారా..? అయితే మీకో ముఖ్య గమనిక. చెక్ పేమెంట్ల కోసం జనవరి 1 నుంచి నూతన విధానం అమల్లోకి రానుంది.
బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. 2021 జనవరి 1 నుంచి చెక్కు ద్వారా చెల్లింపులకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. చెక్ పేమెంట్ల కోసం ‘పాజిటివ్ పే సిస్టమ్’ విధానాన్ని అమలు చేయాలని ఆర్బీఐ గతంలోనే నిర్ణయించింది. రూ.50 వేలు దాటిన చెక్ చెల్లింపుల కోసం.. నూతన నిబంధనల ప్రకారం కీలక వివరాలను మరోసారి ధ్రువీకరించాల్సి ఉంటుంది.
వినియోగదారుల భద్రత దృష్టిలో ఉంచుకొని.. మోసాలకు అడ్డుకట్ట వేయడం కోసం.. కొత్త రూల్ ‘పాజిటివ్ పే’ను ప్రవేశపెట్టారు. ‘చెక్ మోసాలకు అడ్డుకట్ట వేసేలా.. సీటీఎస్-2010 ప్రమాణాల మేరకు చెక్కులపై మినిమం సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి. చెక్కులను ట్యాంపరింగ్ చేయడానికి వీల్లేకుండా కొత్త విధానం ఉపకరించనుంది.
పాజిటివ్ పే విధానం కింద.. ఖాతాదారు ఎవరికైనా రూ.50 వేలు దాటిన చెక్కు ఇచ్చినప్పుడు.. చెక్ వివరాలను బ్యాంకుతో పంచుకోవాల్సి ఉంటుంది. చెక్ నంబర్, చెక్ తేదీ, పేయీ నేమ్ (ఎవరి పేరు మీద చెక్ ఇచ్చామో వారి పేరు), ఖాతా నంబర్, అమౌంట్ తదితర వివరాలతోపాటు చెక్కు రెండు వైపులా ఫొటోలను తీసి.. బ్యాంకుకు ముందే అందించాల్సి ఉంటుంది.
ఈ వివరాలతో చెక్కులను పోల్చి చూసిన
తర్వాత.. రెండింట్లో వివరాలు ఒకేలా ఉంటేనే బ్యాంకులు బెనిఫీయరీకి నగదు చెల్లింపులు
జరుపుతాయి. పాజిటివ్ పే కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓ
విధానాన్ని డెవలప్ చేయనుంది. రూ.50 వేలు దాటిన చెక్కులకు ఈ విధానాన్ని
ఎనేబుల్ చేసే అవకాశం ఉండగా.. ముందుగా రూ.5 లక్షలు దాటిన
చెక్కులకు దీన్ని తప్పనిసరి చేసే ఛాన్స్ ఉంది.
0 Komentar