NIA Faculty Teaching and Non-Teaching Vacancy
Recruitment 2020-21
ఎన్ఐఏలో టీచింగ్, నాట్
టీచింగ్ పోస్టులు
భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వశాఖకు చెందిన జయపుర(రాజస్థాన్)లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద(ఎన్ఐఏ) కింది టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 52
పోస్టులు-ఖాళీలు: అసొసియేట్ ప్రొఫెసర్-01, లెక్చరర్-08, మ్యూజియం క్యురేటర్-01, ఫార్మసిస్ట్-03, క్యాటలాగర్-01, ఎల్‌డీసీ-02, ఎంటీఎస్-36.
అర్హత, వయసు:
1) అసోసియేట్ ప్రొఫెసర్: సంబంధిత సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ(ఆయుర్వేద) ఉత్తీర్ణత. ఐదేళ్ల టీచింగ్(మూడేళ్లు పీజీ టీచింగ్), పరిశోధనా అనుభవం.
వయసు: దరఖాస్తు తేదీ ముగిసే నాటికి 50 ఏళ్లు మించకూడదు.
2) లెక్చరర్:
విభాగాలు: ద్రవ్యగుణ, కౌమార్ బ్రితియ, క్రియా శరీర్, పంచకర్మ, ప్రసూతి తంత్ర, రాస శాస్త్ర, స్వస్థ్ వ్రిట్టా.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ(ఆయుర్వేద) ఉత్తీర్ణత, పరిశోధనలో అనుభవం, కంప్యూటర్ నాలెడ్జ్.
వయసు: దరఖాస్తు తేదీ ముగిసే నాటికి 40 ఏళ్లు మించకూడదు.
3) మ్యూజియం క్యురేటర్: బీఎస్సీ(బోటనీ) ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల సంబంధిత అనుభవం.
వయసు: దరఖాస్తు తేదీ ముగిసే నాటికి 35 ఏళ్లు మించకూడదు.
4) ఫార్మసిస్ట్: ఇంటర్మీడియట్, ఆయుష్ నర్సింగ్ & ఫార్మసీలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు మూడేళ్లకు తగ్గకుండా ఇంటర్న్‌షిప్/ ఆయుర్వేదలో బీఫార్మసీ చేసి ఉండాలి.
వయసు: దరఖాస్తు తేదీ ముగిసే నాటికి 30 ఏళ్లు మించకూడదు.
5) క్యాటలాగర్: పదోతరగతి, లైబ్రరీ సైన్స్‌లో ఏడాది డిప్లొమా కోర్సు ఉత్తీర్ణత.
వయసు: దరఖాస్తు తేదీ ముగిసే నాటికి 30 ఏళ్లు మించకూడదు.
6) లోయర్ డివిజన్ క్లర్క్(ఎల్‌డీసీ): ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలు, హిందీలో నిమిషానికి 30 పదాల టైపింగ్ స్పీడ్.
వయసు: దరఖాస్తు తేదీ ముగిసే నాటికి 27 ఏళ్లు మించకూడదు.
7) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్): పదోతరగతి ఉత్తీర్ణత.
వయసు: దరఖాస్తు తేదీ ముగిసే నాటికి 25 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసే ప్రక్రియలో భాగంగా ఆబ్జెక్టివ్ టైప్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 60 రోజుల్లోపు.
చిరునామా: Director, National Institute of Ayurveda, Jorawar Singh Gate, Amer Road, Jaipur 302002.
0 Komentar