Nutrition Facts and Health Benefits of
Flax Seeds
అవిసె గింజలు వాటి యొక్క ఆరోగ్య
ప్రయోజనాలు
మెరుస్తూ, కొంచెం గట్టిగా ఉండే అవిసె గింజలు సూపర్ ఫుడ్స్ లిస్ట్ లో ఉన్నాయని తెలుసా మీకు? ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఈ గింజల్ని వివిధ రకాల పద్ధతుల్లో వారి ఆహారం లో భాగం చేసుకుంటున్నారు. పైగా వీటిని రకరకాల వంటల్లో రకరకాలుగా వాడుకోవచ్చు.
హెల్త్ బెనిఫిట్స్..
1. అవిసె గింజల్లో ఎన్నో
పోషకాలున్నాయి. ప్రోటీన్, ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉన్నాయి.
2. అవిసె గింజల్లో ఉండే
ఒమేగా-3, అల్ఫా లినోలెనిక్ యాసిడ్ గుండె ని ఆరోగ్యంగా
ఉంచుతాయి.
3. అవిసె గింజలు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటాయి. బ్రెస్ట్, ప్రోస్టేట్ కాన్సర్లతో పాటూ మరి కొన్ని కాన్సర్లను కూడా ప్రివెంట్ చేయగలవు.
4. అవిసె గింజల్లో ఉండే
డైజెస్టివ్ ఫైబర్ డైజెస్టివ్ హెల్త్ కి ఎంతో మేలు చేస్తుంది.
5. అవిసె గింజల్లో ఉండే
ఫైబర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించి, హార్ట్ హెల్త్ ని
ఇంప్రూవ్ చేస్తుంది.
6. అవిసె గింజలు బ్లడ్
ప్రెజర్ ని తగ్గించగలవనీ, హైబీపీ ఉన్న వారికి ఎంతో మంచిదనీ
నిపుణులు చెబుతూంటారు.
7. మాంసాహారం తీసుకోని
వారికి అవిసె గింజల్లో ఉండే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ మేలు చేస్తుంది.
8. అవిసె గింజల్లో ఉండే
ఇన్సాల్యుబుల్ ఫైబర్ వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి, అందుకని ఇవి డయాబెటిక్స్ కి మంచిది.
9. అవిసె గింజల వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. అందు వల్ల ఇవి వెయిట్ లాస్ కి కూడా సహకరిస్తాయి.
ఎలా తీసుకోవచ్చు..
అవిసె గింజల్ని అలాగే తినేయడం కష్టం, అవి అరగవు, వాటి పోషకాలని శరీరం గ్రహించుకోలేదు. అందుకని వాటిని పొడి కొట్టి తీసుకోవడం మంచిది. లేదంటే నానబెట్టి తీసుకోవచ్చు. ఇక్కడ కొన్ని పద్ధతులున్నాయి చూడండి.
1. అవిసె గింజల పొడి ని
నీటిలో కలిపి తాగవచ్చు
2. అవిసె నూనె ని సలాడ్
డ్రెస్సింగ్ లా వాడవచ్చు.
3. అవిసె గింజల పొడి ని బ్రేక్ ఫాస్ట్ సెరియల్ మీద చల్లుకోవచ్చు.
4. యోగర్ట్ లో ఈ పొడి ని
కలుపుకోవచ్చు.
5. కుకీస్, మఫిన్స్, బ్రెడ్స్ చేసేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు.
6. స్మూతీల్లో
కలుపుకోవచ్చు.
7. ఎగ్ కి బదులుగా
వాడుకోవచ్చు.
8. మీట్ ప్యాటీస్ లో యాడ్ చేసుకోవచ్చు.
అవిసె గింజలకి ఉన్న అనేక రకాలైన బెనిఫిట్స్ లో డయాబెటీస్ మ్యానేజ్మెంట్ కూడా ఒకటి. ఇక్కడ అందుకు సరిపోయే విధంగా కొన్ని రెసిపీలు ఉన్నాయి, చూడండి.
1. అవిసె గింజలు, నిమ్మ రసం నీరు
అవిసె గింజల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి పొద్దున్నే కొద్దిగా నిమ్మ రసం కలుపుకుని తాగవచ్చు. బ్రేక్ ఫాస్ట్ లో ప్యాక్ చేసిన జ్యూసులు తాగే కన్నా ఇది తాగితే డీటాక్స్, లో-క్యాలరీ, హెల్దీ డ్రింక్ తాగినట్లు.
2. అవిసె గింజల రైతా
షుగర్ పేషెంట్స్ కి ఇచ్చే డైట్ లో బహుశా ఈ రైతాని బెస్ట్ అని చెప్పవచ్చు. సొరకాయ, అవిసె గింజల పొడిని పెరుగులో కలిపి కొద్దిగా ఉప్పు వేసి తీసుకుంటే రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇది లో క్యాలరీ, లో కార్బ్ ఆప్షన్ కూడా. పైగా సొరకాయ గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువే.
3. అవిసె గింజలు, సగ్గుబియ్యం భేల్
ఈ భేల్ ని తేలికగా చేయవచ్చు, రిఫ్రెషింగ్ గా ఉంటుంది, కడుపు నిండుతుంది. షుగర్ పేషెంట్స్ ఎప్పుడూ ఒకటి గుర్తుంచుకోవాలి, షుగర్ లెవెల్స్ పెరిగిపోకుండా లైట్ గా ఏమైనా తీసుకుంటూ ఉండాలి. ఈ భేల్ అందుకు సరిగ్గా సరిపోతుంది. అవిసె గింజలు, సగ్గు బియ్యం తో పాటూ మసాలాలు కూడా కలిపి చేసే ఈ భేల్ ఎవరికైనా నచ్చి తీరుతుంది.
4. అవిసె గింజలు, ఓట్స్ మాత్రీ
అవిసె గింజలు, ఓట్స్ రెండింటిలోనూ పోషకాలు పుష్కలం గా ఉంటాయి. ఈ రెండింటినీ అనే రకాలుగా వాడుకోవచ్చు. వీటిని కలిపి మాత్రీ చేస్తే సాయంత్రం టీకి మంచి కాంబినేషన్.
5. అవిసె గింజల పరాఠా
అవిసె గింజల్ని అతి తేలికగా వాడుకునే విధానం ఇది. పరాఠాకి పిండి కలుపుతున్నప్పుడే గుప్పెడు అవిసె గింజలు కూడా కలిపి వేడి వేడి పెనం మీద కాల్సితే ఆ రుచే వేరు. మీకు నచ్చిన ఊరగాయతో తిన్నారంటే ఇంక చెప్పక్కర్లేదు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల
ప్రకారం ఈ వివరాలను అందించాం.
0 Komentar