Prime Minister Flags Off India's First
Driver-less Train for Delhi Metro
తొలి డ్రైవర్ రహిత రైలు.. ప్రారంభించిన ప్రధాని
దేశంలోనే తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. దిల్లీ మెట్రోకు సంబంధించి.. పశ్చిమ జనక్‌పురి-బొటానికల్ గార్డెన్ మధ్య 37 కిలోమీటర్ల పొడవున్న మెజంటా లైన్‌లో ఈ రైలును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ఆవిష్కరించారు. నేటి నుంచే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం
ద్వారా నడిచే మెరుగైన రవాణా వ్యవస్థకు సంబంధించి నవ శకానికి ఇది ప్రారంభమని దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్‌సీ) పేర్కొంది.
మజ్లిస్ పార్క్-శివ్ విహార్ మధ్య 57 కిలోమీటర్ల పొడవున్న
పింక్ లైన్ మార్గంలోనూ చోదకరహిత మెట్రో రైలు సేవలను 2021
మధ్యకాలం నాటికి విస్తరించనున్నట్లు వెల్లడించింది. పింక్ లైన్ కూడా
ప్రారంభమైతే.. దిల్లీ మెట్రోలో 94 కిలోమీటర్ల మేర డ్రైవర్
రహిత రైలు సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ప్రపంచంలోని డ్రైవర్ రహిత
మెట్రో మార్గంలో ఇది సుమారు 9 శాతం అని డీఎంఆర్‌సీ
పేర్కొంది.
0 Komentar