పోస్టాఫీసు ఖాతాదారులకు ముఖ్య
హెచ్చరిక.. వెంటనే బ్యాలెన్స్ చెక్ చేస్కోండి!
పోస్టాఫీసు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్య గమనిక. మీ అకౌంట్లలో కనీస నగదు నిల్వ లేకపోతే రూ.100 జరిమానా విధిస్తామని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ ప్రకటించింది. దీనికి జీఎస్టీ అదనమని తెలిపింది.
మీకు పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉందా..? అయితే మీకో ముఖ్య గమనిక. పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్‌లో ఇక నుంచి తప్పకుండా రూ.500 కనీస బ్యాలెన్స్ ఉండాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్టు ప్రకటించింది. డిసెంబర్ 11 నాటికి ఖాతాదారుల సేవింగ్స్ అకౌంట్లో కనీస నగదు నిల్వ ఉండాలని సూచించింది. లేనిపక్షంలో మీ బ్యాంక్ ఖాతా నుంచి రూ.100 ప్లస్ జీఎస్టీని మెయింటెనెన్స్ ఫీజు రూపంలో కట్ చేస్తారు.
పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్స్ ద్వారా ప్రస్తుతం 4 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. ఈ ఖాతా తెరవడం కోసం రూ. 500 కనీస నగదు అవసరం.
పోస్టాఫీస్‌లో కనీస నగదు డిపాజిట్ మొత్తం రూ. 500 కాగా.. కనీస నగదు ఉపసంహరణ మొత్తం రూ.50. గరిష్టంగా ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. మినిమమ్ బ్యాలెన్స్ (రూ.500) ప్రభావితమయ్యే పక్షంలో నగదు విత్ డ్రా చేసుకోవడానికి అనుమతి ఇవ్వరు. బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు మొత్తం సున్నాకు చేరితే ఖాతా ఆటోమెటిక్‌గా క్లోజ్ అవుతుంది.
ఏదైనా నెల పదో తేదీ నుంచి నెలాఖరు మధ్య ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ ఆధారంగా వడ్డీని లెక్కిస్తారు. ఈ రోజుల మధ్య బ్యాలెన్స్ రూ.500 కంటే తగ్గితే.. వడ్డీని కలపరు. కేంద్ర ఆర్థిక శాఖ సూచనలకు అనుగుణంగా ఆర్థిక సంవత్సరం చివర్లో వడ్డీని ఖాతాలో కలుపుతారు.
ఆదాయపన్ను చట్టం 80టీటీఏ
ప్రకారం ఓ ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల్లో వడ్డీల ద్వారా వచ్చిన రూ.10 వేల లోపు ఆదాయానికి పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఒకవేళ ఏ ఖాతా ద్వారా
అయినా మూడేళ్లపాటు ఎలాంటి లావాదేవీలు జరగకపోతే.. సంబంధిత పోస్టాఫీస్‌లో అప్లికేషన్‌తోపాటు
కేవైసీ డాక్యుమెంట్లు, పాస్‌బుక్ సమర్పించాల్సి ఉంటుంది.
0 Komentar