Power Finance Corporation (PFC)
Recruitment 2021
రాత పరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ 41 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
భారత ప్రభుత్వ రంగానికి చెందిన న్యూదిల్లీలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎఫ్‌సీ) ఒప్పంద ప్రాతిపదికన 41 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. 2021 జనవరి 18 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.pfcindia.com/ వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 41
1. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్:
34
అర్హత: ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్
అండ్ కమ్యూనికేషన్/ ఐటీ/ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్
ఉత్తీర్ణత. కనీసం ఐదేళ్ల సంబంధిత అనుభవం ఉండాలి.
వయసు: కనీస వయసు 21
ఏళ్లకు తగ్గకుండా, గరిష్ఠ వయసు 45
ఏళ్లకు మించకుండా ఉండాలి.
2. కన్సల్టెంట్ టెక్నికల్-1:
06
అర్హత: ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్
అండ్ కమ్యూనికేషన్/ ఐటీ/ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్
ఉత్తీర్ణత. కనీసం ఐదేళ్ల సంబంధిత అనుభవం ఉండాలి.
వయసు: కనీస వయసు 21
ఏళ్లకు తగ్గకుండా, గరిష్ఠ వయసు 45
ఏళ్లకు మించకుండా ఉండాలి.
3. కన్సల్టెంట్ టెక్నికల్-2:
01
అర్హత: ఐటీ/ కంప్యూటర్ సైన్స్‌లో
బీఈ/ బీటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణత. కనీసం మూడేళ్లకు మించి సంబంధిత అనుభవం ఉండాలి.
సంబంధిత టెక్నికల్ నైపుణ్యాల్లో నాలెడ్జ్ ఉండాలి.
వయసు: కనీస వయసు 21 ఏళ్లకు తగ్గకుండా, గరిష్ఠ వయసు 45 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ముఖ్య సమాచారం:
ఎంపిక విధానం: అర్హతలు కలిగిన
అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి
పిలుస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
డిసెంబర్ 29, 2020.
దరఖాస్తుకు చివరి తేది: జనవరి 18, 2021.
వెబ్‌సైట్: https://www.pfcindia.com/
0 Komentar