RBI Hikes Limit for Contactless Card
Transaction to Rs 5000 Know Details
క్రెడిట్ కార్డు, డెబిట్
కార్డ్ కొత్త రూల్స్! జనవరి 1 నుంచి అమలులోకి
మీరు కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డు లేదంటే క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే మీకు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. ఆర్‌బీఐ కొత్త రూల్స్ తీసుకువస్తోంది. జనవరి 1 నుంచి ఇవి అమలులోకి వస్తాయి.
డెబిట్ కార్డు, క్రెడిట్
కార్డు వాడే వారికి అలర్ట్
కొత్త రూల్స్ అమలులోకి
మీరు డెబిట్ కార్డు వాడుతున్నారా? లేదంటే క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI కొత్త రూల్స్ తీసుకువచ్చింది. డిజిటల్ పేమెంట్స్‌ను పెంచాలనే లక్ష్యంతో ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వాడే వారికి బెనిఫిట్ కలుగనుంది.
కాంటాక్ట్‌లెస్ కార్డుల ట్రాన్సాక్షన్ లిమిట్‌ను పెంచుతున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ప్రస్తుతం ఉన్న రూ.2,000 నుంచి రూ.5,000 వరకు పెంచుతున్నట్లు వివరించింది. అంటే రూ.5 వేల వరకు ట్రాన్సాక్షన్లకు ఇకపై పిన్ ఎంటర్ చేయాల్సిన పని లేదు. సులభంగానే లావాదేవీలను పూర్తి చేయొచ్చు.
ఈ కొత్త రూల్స్ జనవరి 1 నుంచి అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం చాలా బ్యాంకులు వారి కస్టమర్లకు కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. దీంతో కస్టమర్లు సులభంగానే లావాదేవీలు పూర్తి చేయొచ్చు. కరోనా వైరస్ సమయంలో కాంటాక్ట్‌లెస్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
మరోవైపు రిజర్వు బ్యాంక్ మరో కీలక అంశాన్ని కూడా వెల్లడించింది. ఆర్‌టీజీఎస్ లావాదేవీలు కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే బ్యాంక్ కస్టమర్లు ఎప్పుడైనా ఆర్‌టీజీఎస్ ద్వారా డబ్బులు పంపించొచ్చు.
0 Komentar