ఏపి: 120 ఫార్మసీ కళాశాలలకు
అనుమతుల పునరుద్ధరణ
రాష్ట్రంలో 120 ఫార్మసీ కళాశాలలకు అనుమతులను పునరుద్ధరిస్తూ ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక
ప్రధాన కార్యదర్శి సతీశ్చంద్ర ఉత్తర్వులిచ్చారు. తొమ్మిది విశ్వవిద్యాలయాల్లోని కళాశాలల్లో
520 సీట్లు, 111 ప్రైవేట్ కళాశాలల్లో 10,155 సీట్లకు అనుమతించారు. ప్రైవేట్ కళాశాలలు 2017-18
వరకు ఉన్న అనుబంధ గుర్తింపు బకాయిలు చెల్లించి విశ్వవిద్యాలయాల్లో అఫిడవిట్లు
సమర్పించాలని సూచించారు.
257 ఇంజినీరింగ్
కళాశాలలకు..
రాష్ట్రంలో 257 ఇంజినీరింగ్ కళాశాలలకు అనుమతులు పునరుద్ధరిస్తూ సతీశ్చంద్ర మరో
ఉత్తర్వు జారీ చేశారు. 18 విశ్వవిద్యాలయ కళాశాలలు,
239 ప్రైవేట్ కళాశాలలకు అనుమతులు పునరుద్ధరించారు.
0 Komentar