RTGS Money Transfer Facility to be Operational
24X7 from Today
బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త. ఇక నుంచి రోజులో మీకు నచ్చిన సమయంలో ఎప్పుడైనా ఆర్టీజీఎస్ ద్వారా నగదు లావాదేవీలు జరుపుకొనేందుకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిది. ఇప్పటి వరకూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఆర్టీజీఎస్ ద్వారా డబ్బు పంపుకోవచ్చు.
డిజిటల్ లావాదేవీలను మరింత పెంచే దిశగా మరో ముందడుగు పడింది. నేటి (డిసెంబర్ 14, 2020) నుంచి రియల్ టైం గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్టీజీఎస్) ద్వారా 24 గంటలపాటూ నగదు లావాదేవీలు నిర్వహించుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతిచ్చింది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత 12.30 గంటల నుంచి ఆర్టీజీఎస్ సౌలభ్యం అందుబాటులోకి వచ్చిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. నేటి నుంచి సంవత్సరంలోని అన్ని రోజులూ.. రౌండ్ ది క్లాక్ ఆర్టీజీఎస్ అందుబాటులో ఉంటుందన్నారు.
ఆర్టీజీఎస్‌ను ఆర్టీజీఎస్ సిస్టమ్ రెగ్యులేషన్స్, 2013 పర్యవేక్షిస్తుంది. ఈ బాడీ నిబంధనలను కాలానికి అనుగుణంగా సవర్తిస్తుంటుంది. బ్యాంకింగ్ పని గంటలు ముగిసిన తర్వాత ఆర్టీజీఎస్ లావాదేవీల స్థానంలో ఆటోమేటిగ్గా ఎస్టీపీ (స్ట్రైట్ త్రూ ప్రాసెసింగ్)ను ఉపయోగిస్తారని భావిస్తున్నారు.
హై వాల్యూ ట్రాన్సాక్షన్లకు ఆర్టీజీఎస్ సిస్టమ్‌ను ఉపయోగిస్తారు. రియల్ టైం ఆధారంగా ఇది జరుగుతుంది. ఇప్పటి వరకూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు.. బ్యాంకుల పని దినాల్లో మాత్రమే ఆర్టీజీఎస్ అందుబాటులో ఉంది. ఆర్టీజీఎస్ ద్వారా నగదు లావాదేవీలపై ఛార్జీల వడ్డనను 2019 జులైలో ఆర్బీఐ నిలిపేసింది.
0 Komentar