Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SBI Apprentice Recruitment 2020 Apply For 8500 Posts

 


SBI Apprentice Recruitment 2020 Apply For 8500 Posts

ఏపీ, తెలంగాణలో 1080 బ్యాంక్‌ జాబ్స్‌.. జిల్లాల వారీగా ఖాళీల జాబితా ఇదే..!

SBI Jobs 2020: దేశవ్యాప్తంగా 8500 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ఎస్‌బీఐ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశవ్యాప్తంగా.. 8500 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది.. మొత్తం పోస్టుల్లో ఏపీ, తెలంగాణలో 1080 పోస్టులున్నాయి. 

2020 అక్టోబర్ 31 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్‌ 10 దరఖాస్తుకు చివరితేది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://sbi.co.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. 

అభ్యర్థుల వయస్సు 2020 అక్టోబర్ 31 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. 

రాతపరీక్ష, స్థానిక భాషలో పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి స్టైపెండ్ మొదటి ఏడాది నెలకు రూ.15,000, రెండో ఏడాది నెలకు రూ.16,500, మూడో ఏడాది నెలకు రూ.19,000 లభిస్తుంది. 

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీలు: 620

నెల్లూరు- 37, చిత్తూరు- 43, కడప- 51, అనంతపూర్- 28, కర్నూలు- 43, శ్రీకాకళం- 33, విజయనగరం- 29, విశాఖపట్నం- 44, తూర్పుగోదావరి- 62, పశ్చిమ గోదావరి- 75, కృష్ణా- 53, గుంటూరు- 75, ప్రకాశం- 47. 

తెలంగాణలో ఖాళీలు: 460

మహాబూబాబాద్ -12, మహబూబ్‌నగర్ -33, ఆదిలాబాద్ -10, భద్రాద్రి కొత్తగూడెం -21, జగిత్యాల -9, జనగాం -10, జయశంకర్ -12, జోగులంబా -9, కామారెడ్డి -16, కరీంనగర్ - 14, ఖమ్మం - 24, కొమరంభీమ్ -7, మల్కాజ్‌గిరి -5, మంచిర్యాల -8, మెదక్ -14, నాగర్‌కూర్నూల్ -15, నల్గొండ -22, నిర్మల్ -11, నిజామాబాద్ -39, పెద్దపల్లి -10, రంగారెడ్డి -22, సంగారెడ్డి -20, సిద్దిపేట -17, సిరిసిల్ల -6, సూర్యపేట -28, వికారాబాద్ -23, వనపర్తి -12, వరంగల్ -4, వరంగల్ రూరల్-11, యాదాద్రి భువనగిరి -16 పోస్టులున్నాయి. 

(Apply Online from 20.11.2020 to 10.12.2020)

NOTIFICATION 

APPLY HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags