SCERT Released the Academic Calendar
2020-21 for Schools
ఏప్రిల్ చివరి వారంలో ఫైనల్ పరీక్షలు - స్కూళ్ల అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసిన ఎస్సీఈఆర్టీ
రాష్ట్రంలోని అన్ని పాఠశాలల తరగతుల
విద్యార్థులకు సంవత్సరాంత (సమ్మేటివ్) పరీక్షలను ఏప్రిల్ చివరి వారంలో
నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి
(ఎస్సీఈఆర్టీ) శనివారం అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. కోవిడ్ వల్ల
తరగతులను చాలా ఆలస్యంగా, దశలవారీగా ప్రారంభిస్తున్న సంగతి
తెలిసిందే. ఈ నేపథ్యంలో పని దినాలకు తగ్గట్టుగా పాఠ్యాంశాల బోధనను ఎస్సీఈఆర్టీ
సర్దుబాటు చేసింది. ముఖ్యమైన అంశాలను తరగతి గదిలో బోధన చేయిస్తూ.. కృత్యాధారిత
కార్యక్రమాలు, ఇతర అంశాలను విద్యార్థులు ఇంటి వద్ద
అభ్యసించేలా చర్యలు చేపట్టింది ఆన్లైన్ బోధనను కూడా కొనసాగిస్తోంది. ప్రస్తుతం
ఏప్రిల్ చివరి వరకు తరగతులు నిర్వహించాలని విద్యా శాఖ నిర్ణయించింది. మొత్తం 138
పనిదినాలు అందుబాటులో ఉంటాయని.. ఇందులో 102
పని దినాలు స్కూళ్లలో బోధనకు, 36 పని దినాలు ఇంటివద్ద నేర్చుకునేందుకు
వీలుగా పాఠ్య ప్రణాళికను ఇప్పటికే అందించింది. మరోవైపు పరీక్షలను కూడా కుదించింది.
గతంలో ఫార్మేటిన్లు 4 ఉండగా.. ఈసారి రెండుకు పరిమితం
చేసింది. అలాగే సమ్మేటివ్ లు రెండు ఉండగా, ఒక్కటి మాత్రమే నిర్వహించబోతోంది.
0 Komentar