Solar Eclipse 2020: Everything you need
to know about the last solar eclipse of the year
నేడు ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం –
ఈ ఏడాది మొత్తం ఆరు గ్రహణాలు
ఈ ఏడాది మొత్తం ఆరు గ్రహణాల్లో
ఇప్పటికే ఐదు గ్రహణాలు సంభవించాయి. వీటిలో నాలుగు చంద్ర గ్రహణాలు, ఒక
సూర్య గ్రహణం ఏర్పాడ్డాయి. మరో సూర్య గ్రహణం డిసెంబర్ 14న
ఏర్పడనుంది. ఇదే ఈ ఏడాదిలో ఏర్పడే చివరి గ్రహణం కావడం గమనార్హం. ఈ ఏడాదిలో ఇది
రెండో సూర్య గ్రహణం. ఈ సూర్య గ్రహణానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.
నేడు (డిసెంబర్ 14)
సూర్య గ్రహణం..
జూన్ 21, 2020న మొదటి సూర్యగ్రహణం సంభవించగా.. ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం డిసెంబర్ 14న ఏర్పడనుంది. ఈ ఏడాది చివరలో సంభవించే చివరిదైన ఈ సూర్య గ్రహణం
భారతదేశంలో ఐదు గంటలపాటు ఉంటుంది. సూర్యగ్రహణం డిసెంబర్ 14న
రాత్రి 7.03 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 12.23 గంటలకు ముగియనుంది. రాత్రి 8.02 నిమిషాలకు సంపూర్ణ
సూర్యగ్రహణం ప్రారంభమై రాత్రి 9.43గంటలకు పూర్తిస్థాయిలో
సూర్యగ్రహణం ఏర్పడనుంది.
భారత్‌లో కనిపించని సూర్య గ్రహణం..
ఎందుకంటే?
కాగా, ఈ సూర్య గ్రహణం భారతదేశంలో మనకు కనిపించదు. ఈసారి రాత్రి సమయంలో ఏర్పడుతుందడటంతో సూర్యూడు కనిపించే అవకాశం లేదు. దక్షిణ అమెరికా, నైరుతి ఆఫ్రికా, అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాల్లో పాక్షిక సూర్యగ్రహణాన్ని ఏర్పడుతుంది. శాంటియాగో(చిలీ), సోవాపాలో(బ్రెజిల్), బ్యూనస్ ఎయిర్స్(అర్జెంటీనా), లిమా(పెరూ), మాంటెవీడియో(ఉరుగ్వే), అసున్సియన్(పరాగ్వే) దేశాల్లో పాక్షిక సూర్యగ్రహణం కనిపించనుంది.
0 Komentar