Sonu Sood launches Rs 5 lakh scholarship
for aspiring medical students
విదేశాల్లో చదివే వైద్య విద్యార్డులకు
5 లక్షల సాయం
విదేశీ వైద్య విద్య అంటేనే చాలా
ఖర్చుతో కూడుకున్నది. పేద, మధ్యతరగతి వారు తమ కలలు నిజం చేసుకునేందుకు
సుప్రసిద్ధ నటుడు సోనూసూద్ ఉపకార వేతనాలను అందించటానికి ముందుకొచ్చారు.
ఐఎస్ఎం ఎడ్యుటెక్ సంస్థతో కలిసి
సోనూసూద్ స్కాలర్ షిప్ ప్రోగ్రాం మను ఇటీవలే ప్రారంభించారు. కిర్గిజ్స్తాన్, కజకిస్తాన్,
జార్జియా, తజకిస్థాన్లలోని ప్రముఖ
విశ్వవిద్యాలయాల్లో మెడిసిన్ చదవాలనుకుంటున్న విద్యార్థులు ఉపకార వేతనాలు కోసం https://sonuism.org/ పోర్టల్‌లో డిసెంబరు 15 లోగా -దరఖాస్తు
చేసుకోవలసి వుంటుంది.
కిర్గిస్తాన్లో ఇంటర్నేషనల్ హయ్యర్
స్కూల్ ఆప్ మెడిసిన్ (ఐఎస్ఎం- ఐయూకే, కజకిస్తాన్లో కజక్ రష్యన్
మెడికల్ యూనివర్సిటీ, జార్జియాలో ఈస్ట్ యూరోపియన్
యూనివర్సిటీ, జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ, ఇంకా మరో ఆరు వర్సిటీల్లో చదవాలనుకుంటున్న విద్యార్థులు పోర్టలోని
ఆప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్నవారికి
ఆన్లైన్ పరీక్షను నిర్వహించి అందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు వారు కోరిన
విశ్వవిద్యాలయాల్లో చదివేందుకు 5 లక్షల రూపాయల చొప్పున స్కాలర్‌షిప్పులు
అందిస్తామని ఐఎస్ఎం ఎడ్యుటెక్ పౌండర్, చైర్మన్ డాక్టర్ పణి
భూషణ్ తెలిపారు.
0 Komentar