SSC CGL 2020-21 Recruitment Notification
- Check Important Dates
డిగ్రీ అర్హతతో సెంట్రల్
గవర్నమెంట్ జాబ్... నోటిఫికేషన్ వివరాలు ఇవే
స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది. గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టుల భర్తీకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 2020 డిసెంబర్ 21న ఈ నోటిఫికేషన్ విడుదలవుతుంది. దరఖాస్తు ప్రక్రియ అదే రోజున ప్రారంభం అవుతుంది. అప్లై చేయడానికి 2021 జనవరి 25 చివరి తేదీ. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in/ లో నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, సంస్థలు, విభాగాల్లో అసిస్టెంట్, సబ్ ఇన్‌స్పెక్టర్, అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, ట్యాక్స్ అసిస్టెంట్, ఇన్‌స్పెక్టర్, అప్పర్ డివిజన్ క్లర్క్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC. గతేడాది ఇదే నోటిఫికేషన్ ద్వారా 9488 పోస్టుల్ని భర్తీ చేసింది. మరి ఈసారి ఎన్ని ఎన్ని వేల పోస్టుల్ని భర్తీ చేయనుందో త్వరలో వెల్లడిస్తుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC.
SSC CGL 2020-21 examination: గుర్తుంచుకోవాల్సిన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 డిసెంబర్ 21
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జనవరి 25
ఆన్‌లైన్ ఫీజ్ పేమెంట్‌కు చివరి తేదీ- వెల్లడించాల్సి ఉంది
ఆఫ్‌లైన్ చలానా జనరేట్ చేయడానికి
చివరి తేదీ- వెల్లడించాల్సి ఉంది
చలానా ద్వారా పేమెంట్ చేయడానికి
చివరి తేదీ- వెల్లడించాల్సి ఉంది
మొదటి దశ కంప్యూటర్ బేస్డ్
ఎగ్జామినేషన్- 2021 మే 29 నుంచి 2021 జూన్ 7
మొదటి దశ కంప్యూటర్ బేస్డ్
ఎగ్జామినేషన్ ఫలితాలు- తేదీని ప్రకటించాల్సి ఉంది
రెండో దశ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్- తేదీని ప్రకటించాల్సి ఉంది
SSC CGL 2020-21 examination: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
భర్తీ చేసే పోస్టుల మొత్తం- త్వరలో
వెల్లడించనున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC
విద్యార్హత- అభ్యర్థులు ఆయా
సబ్జెక్ట్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ కావాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న
విద్యార్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు.
దరఖాస్తు ఫీజు- రూ.100
ఎంపిక విధానం- నాలుగు దశల
పరీక్షల్లో పాస్ కావాలి.
0 Komentar