Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Surprising and Interesting Facts About Coffee

 

Surprising and Interesting Facts About Coffee

కాఫీ తాగడం వల్ల వచ్చే బెనిఫిట్స్ 

===================

పొద్దున్నే నిద్ర లేవగానే కాఫీ తాగకపోతే రోజు మొదలయినట్లు ఉండదు చాలా మందికి. అయితే, అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు కాఫీ కూడా ఎక్కువగా తాగితే కొన్ని సమస్యలు ఉన్నాయి. కాఫీ తాగడం వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. రెండూ ఒకసారి చూసేద్దామా మరి.

కాఫీ తాగడం వల్ల వచ్చే బెనిఫిట్స్: 

1. వర్కౌట్ కి ఒక గంట ముందు కాఫీ తాగితే జిమ్ లో బాగా పెర్ఫార్మ్ చేయగలరని చాలా మంది అంటారు. ఎందుకంటే, కాఫీ ఎడ్రినలిన్ లెవెల్స్ ని పెంచుతుంది. 

2. కాఫీలో ఉన్న మెగ్నీషియం, పొటాషియం శరీరం ఇన్సులిన్ ని యూజ్ చేసుకోవడం లో హెల్ప్ చేస్తాయి, బ్లడ్ షుగర్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేస్తాయి, స్వీట్స్ మరియూ స్నాక్స్ మీద ఉండే క్రేవింగ్స్ ని కంట్రోల్ చేస్తాయి.

3. కాఫీలో ఉండే కెఫీన్ వల్ల బరువు తగ్గడం లో సాయం జరుగుతుంది.

4. కాఫీ వల్ల మెంటల్ అలర్ట్‌నెస్ పెరుగుతుంది, ఫోకస్ చేయగలుగుతారు.

5. కాఫీ తాగని వారితో పోలిస్తే కాఫీ తాగేవారు అకాలమరణం పొందే రిస్క్ ఇరవై ఐదు శాతం తక్కువని తెలుస్తోంది.

6. కాఫీ కొన్ని కాన్సర్లని ప్రివెంట్ చేయగలదు.

7. కాఫీ వల్ల స్ట్రోక్ వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది.

8. కాఫీ వల్ల పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే రిస్క్ ఇరవై ఐదు శాతం తగ్గుతుంది.

9. కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ నుండి బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి.

10. కాఫీ వల్ల టైప్ 2 డయాబెటీస్ రిస్క్ కూడా తగ్గవచ్చు.

11. కాఫీ వల్ల డిమెన్షియా, అల్జైమర్స్ వంటివి వచ్చే రిస్క్ తగ్గుతుంది.

12. కాఫీ మంచి మూడ్ ని ఇస్తుంది, డిప్రెషన్ ని తగ్గిస్తుంది. 

అయితే, ఈ బెనిఫిట్స్ అన్నీ రోజుకి ఒకటి రెండు కప్పుల కాఫీ వరకూ తాగితే మాత్రమే తాగితే లభిస్తాయి. ఆ సంఖ్య ఎక్కువైతే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో ఇప్పుడు చూద్దాం. 

కాఫీ ఎక్కువగా తాగడం వల్ల వచ్చే సమస్యలు: 

1. కాఫీ పునరుత్పత్తి వ్యవస్థ మీద దెబ్బ కొడుతుంది.

2. కొంతమందికి కాఫీ ఎక్కువైతే యాంగ్జైటీ పెరుగుతుంది.

3. బాడీలో ఉండే విటమిన్ బీ, మెగ్నీషియం లెవెల్స్ కాఫీ ఎక్కువైతే తగ్గిపోతాయి.

4. పాలూ పంచదార కలిపి తాగే కఫీ ఎక్కువైతే మాత్రం ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందని నిపుణులు అంటున్నారు.

5. కాఫీ ఎక్కువైతే సరిగ్గా నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు వస్తాయి.

6. గర్భవతులు రోజుకి ఒక కప్పు కంటే ఎక్కువగా కాఫీ తాగకుండా ఉండడం శ్రేయస్కరం.

7. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వారు ఫిల్టర్ కాఫీని ఎంచుకోవాలి.

8. చిన్న పిల్లల్లో కాఫీ తాగే అలవాటు పక్క తడిపే సమస్యని పెంచుతుందని తెలుస్తోంది. 

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం.

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags