నేటి అర్ధరాత్రి దాకా వెబ్ ఆప్షన్స్ - 19 తరువాత బదిలీ ఉత్తర్వులు - త్వరలో ఎంసెట్ కౌన్సెలింగ్ - విద్యామంత్రి సురేష్
నేటి అర్ధరాత్రి దాకా వెబ్ ఆప్షన్స్ కు అవకాశం
ఉపాధ్యాయ బదిలీలపై విద్యామంత్రి సురేష్ ప్రకటన
19 తరువాత బదిలీ ఉత్తర్వులు అందజేత
త్వరలో ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలు ప్రకటన
ఉపాధ్యాయ బదిలీల వెబ్ ఆప్షన్ల తో పాటు సవరణలకు ఈ నెల 18 తేదీ (శుక్రవారం) అర్ధరాత్రి 12 గంటల దాకా అవకాశం ఇస్తున్న ట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. మారుమూల బడులు మూతపడకుండా ఉండాలనే కొన్ని ఖాళీలను బ్లాక్ చేశామన్నారు. సచివాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెబ్ ఆప్షన్ ప్రక్రియ పూర్తవగానే 19 తేదీ తరవాత బదిలీ ఉత్తర్వులు అందజేస్తామన్నారు ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. గురువారం సాయంత్రం వరకు 76,119 పోస్టుల బదిలీలకు 74,421 మంది వెబ్ ఆప్షన్ ఇచ్చారని తెలిపారు. తప్పనిసరి కేటగిరీలో 26,117 పోస్టులకు 25,826 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. రిక్వెస్టు కేటగిరి కింద 50 వేల పోస్టులకు 48,595 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. మరో 1,407 మంది ఆప్షన్లు అంజేయాల్సి ఉందన్నారు. సవరణలు చేసుకోదలిచిన వారు తుది గడువును సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. సర్వర్ల మొరాయింపు ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లాల వారీగా సర్వర్లు విభజించామని తెలిపారు.
బ్లాకింగ్ ఎత్తేస్తే మారుమూల బడులు మూతే
ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియలో పోస్టుల బ్లాకింగ్ ఎత్తేస్తే 145 మండలాల్లో ని 5,725 బడుల్లో 10,198 పోస్టులు భర్తీ కావని, దీనివల్ల టీచర్ల కొరతతో అవి మూతబడే ప్రమాదం ఉందన్నారు. అందుకే,16 వేల పోస్టులను బ్లాక్ చేసి పెట్టామన్నారు. ఏయే పాఠశాలల్లో టీచర్ పోస్టులు బ్లాక్ చేశామో ఇప్పటికే వివరించినట్లు చెప్పారు.
త్వరలో ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలు ప్రకటన
త్వరలో ఎంసెట్ కౌన్సెలింగ్
నిర్వహణకు సంబంధించిన తేదీలను వెల్లడిస్తా మని మంత్రి సురేష్ వెల్లడించారు.
ఇంజనీరింగ్ ఫీజులపైనా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. నిబంధనలు పాటించని ఇంజనీరింగ్
కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. కౌన్సెలింగ్ నిర్వహించే సమయంలో
అటువంటి కాలేజీల పేర్లను తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
0 Komentar