Telangana Revamps Water Resources
Department
తెలంగాణలో కొత్తగా 945 పోస్టులు
తెలంగాణలో జలవనరులశాఖను ప్రభుత్వం పూర్తిగా పునర్వ్యవస్థీకరించింది.
దీంతో ఉన్నతాధికారుల పోస్టులు సైతం పెరగనున్నాయి.
రాష్ట్ర జలవనరులశాఖను ప్రభుత్వం పూర్తిగా పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో జలవనరులశాఖకు చెందిన ముఖ్య అధికారులతో సమావేశమై.. రాష్ట్రంలో ఆ శాఖ స్వరూపాన్ని ఖరారుచేశారు. భారీ, మధ్య, చిన్నతరహా నీటిపారుదల విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తేవడంతోపాటు.. ఒకే ప్రాంతంలో ఉన్న అన్నిరకాల జలవనరులశాఖ వ్యవహారాలను ఒకే అధికారి పర్యవేక్షించేలా పునర్వ్యవస్థీకరించారు. దీనికి అనుగుణంగా ఉన్నతాధికారుల పోస్టుల సంఖ్యను పెంచారు.
ప్రస్తుతం ముగ్గురు ఈఎన్‌సీలు ఉంటే కొత్తగా మరో మూడు ఈఎన్‌సీ పోస్టులను మంజూరుచేశారు. దీంతో రాష్ట్రంలో ఈఎన్‌సీల సంఖ్య ఆరుకు చేరుకొంటుంది. సీఈ పోస్టులను 19 నుంచి 22కు, ఎస్‌ఈల పోస్టులు 47 నుంచి 57కు, ఈఈల పోస్టులు 206 నుంచి 234కు, డీఈఈల పోస్టులు 678 నుంచి 892కు, ఏఈఈల పోస్టులను 2,436 నుంచి 2,796కు పెరిగాయి.
అలాగే.. టెక్నికల్ ఆఫీసర్ల సంఖ్యను
129 నుంచి 199కి, అసిస్టెంట్
టెక్నికల్ ఆఫీసర్ల సంఖ్యను 173 నుంచి 242కు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ల సంఖ్యను 346 నుంచి 398కి, నాన్ టెక్నికల్
పర్సనల్ అసిస్టెంట్ల సంఖ్యను 31 నుంచి 45కు, సూపరింటెండెంట్ల సంఖ్యను 187 నుంచి 238కి, రికార్డు
అసిస్టెంట్ల సంఖ్యను 134 నుంచి 205కు
పెంచారు. దీంతో పునర్వ్యవస్థీకరణ కారణంగా మొత్తం 945 అదనపు
పోస్టులు అవసరమవుతాయని అంచనాకు వచ్చారు.
0 Komentar