TS: 4-year Integrated B.Ed Course in
Model Degree Colleges
నాలుగేళ్ల బీఈడీ కోర్సు
- వచ్చే విద్యాసంవత్సరం నుంచి నాలుగు కళాశాలల్లో
సిలబస్‌తయారీపై వర్సిటీల కసరత్తు
వచ్చే విద్యాసంవత్సరం (2021-22) నుంచి రాష్ట్రంలోని నాలుగు ప్రభుత్వ మోడల్‌డిగ్రీ కళాశాలల్లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌బీఈడీ కోర్సును ప్రవేశపెట్టాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. బీఈడీ కోర్సునూ ఇతర వృత్తివిద్య కోర్సుల మాదిరిగా ప్రతిష్ఠాత్మకంగా తీర్చిదిద్దాలని, అందులోకి ప్రతిభావంతులను ఆకర్షించాలన్నది కేంద్రం ఆలోచన. అందుకే ఇంటర్‌తర్వాత నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌బీఈడీ కోర్సును ప్రవేశపెడతామని జాతీయ విద్యావిధానంలో వెల్లడించింది. ఈ కోర్సుకు జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) ఇప్పటికే ఆమోదం తెలిపింది. అందుకనుగుణంగా రాష్ట్ర విద్యాశాఖ కసరత్తు మొదలుపెట్టింది.
ఈ మోడల్‌డిగ్రీ కళాశాలల్లో..
రాష్ట్రంలో రాష్ట్రీయ ఉచ్చతర్‌శిక్షా అభియాన్(రూసా) నిధులతో నారాయణఖేడ్, కల్వకుర్తి, భూపాలపల్లి, లక్షెట్టిపేటలలో నిర్మించిన ప్రభుత్వ మోడల్‌డిగ్రీ కళాశాలల్లో ఇంటిగ్రేటెడ్‌బీఈడీ కోర్సును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ కోర్సు సిలబస్‌తయారీపై రూసా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌నవీన్‌మిత్తల్‌ఇప్పటికే ఓయూ, పాలమూరు, కాకతీయ విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లతో చర్చించారు. ఆయా వర్సిటీల డీన్లు పాఠ్య ప్రణాళికపై కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం డిగ్రీకి 160 క్రెడిట్లు ఉండగా.. ఇంటిగ్రేటెడ్‌బీఈడీకి 200 వరకు క్రెడిట్లు ఉండవచ్చని తెలిసింది. సిలబస్‌సిద్ధమైతే ప్రైవేట్‌బీఈడీ కళాశాలలు సైతం ఈ కోర్సు ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. వాస్తవానికి 2016లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌జిల్లాలోని నాలుగు కళాశాలలు ఈ కోర్సును ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యామండలి నుంచి అనుమతి పొందినా ఆయా వర్సిటీలు సిలబస్‌తయారు చేయకపోవడంతో ప్రారంభం కాలేదు.
ఇంటిగ్రేటెడ్‌కోర్సు అంటే ఒకేసారి
బీఏ-బీఈడీ, బీఎస్‌సీ-బీఈడీ చదవవచ్చు. మొదటి మూడేళ్లలో బీఈడీకి
సంబంధించి ఒక సబ్జెక్టు ఉంటుంది. చివరి ఏడాది మాత్రం పూర్తిగా బీఈడీకి ప్రత్యేకం.
సాధారణంగా మూడేళ్ల డిగ్రీ తర్వాత రెండేళ్ల బీఈడీ చదివితే అయిదేళ్లు అవుతుంది.
ఇంటిగ్రేటెడ్‌కోర్సులో నాలుగేళ్లలో డిగ్రీతోపాటు బీఈడీ పట్టా అందుతుంది.
భవిష్యత్తులో ఉపాధ్యాయ కొలువులకు ఇంటిగ్రేటెడ్‌కోర్సు తప్పనిసరి అని కేంద్రం
ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ ఆ దిశగా అడుగులు వేస్తోంది.
0 Komentar