టిఎస్: 4,055 జూనియర్ అధ్యాపకుల ఖాళీలు
రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 4,055 జూనియర్
అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 5,395 పోస్టులు
మంజూరు కాగా ప్రస్తుతం 1,340 మందే పనిచేస్తున్నారు. మిగిలిన 4,055 ఖాళీల్లో ఒప్పంద, అతిథి అధ్యాపకులు
పనిచేస్తున్నట్లు సమాచార హక్కు చట్టం కింద తాజాగా ఇంటర్ విద్యాశాఖ వెల్లడించింది.
ప్రభుత్వం ఇటీవల ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో కాంట్రాక్టు
అధ్యాపకుల పోస్టులను ఖాళీగా చూపించాలా, లేదా అన్న ప్రశ్న
ఉత్పన్నమైంది.
ఇంటర్ విద్యాశాఖ మాత్రం మొత్తం
మంజూరు పోస్టులు ఎన్ని, ప్రస్తుతం ఎంత మంది పనిచేస్తున్నారన్న
మొత్తం సమాచారంతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలిసింది.
0 Komentar