TS: Agriculture Degree, PG, PhD Counselling - 2020 Updates
ఎంబీబీఎస్ ప్రవేశాలయ్యాకే వ్యవసాయ
డిగ్రీ కౌన్సెలింగ్ - నేటి నుంచి పీజీ, పీహెచ్‌డీ
కౌన్సెలింగ్
రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు పూర్తయిన తరువాతే వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య డిగ్రీ సీట్లను భర్తీ చేయాలని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తాజాగా నిర్ణయించింది. ఎంబీబీఎస్ సీట్లను డిసెంబరు 5న కేటాయిస్తారు. ఆ తరవాత వ్యవసాయ డిగ్రీ కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు డిసెంబరు 4న సవరణ ప్రకటన జారీ చేసేందుకు వర్సిటీ కసరత్తు చేస్తోంది.
వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య డిగ్రీ సీట్ల భర్తీకి రాష్ట్రస్థాయిలో ఎంసెట్ నిర్వహించారు. ఎంబీబీఎస్ సీట్లకు నీట్ ర్యాంకులను ఆధారంగా తీసుకుంటారు. పలువురు విద్యార్థులు ఈ రెండు ప్రవేశ పరీక్షలు రాశారు. తొలుత వ్యవసాయ డిగ్రీ కౌన్సెలింగ్ నిర్వహిస్తే మెరుగైన ర్యాంకులు వచ్చినవారు ఇందులో చేరినా.. ఆ తరవాత ఎంబీబీఎస్ సీటు వస్తే వెళ్లిపోతారు. ఇలా గతంలో వ్యవసాయ డిగ్రీ కోర్సులు సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో ఎంబీబీఎస్ ప్రవేశాల అనంతరం వ్యవసాయ డిగ్రీ కౌన్సెలింగ్ నిర్వహించడం వల్ల ఖాళీలు ఏర్పడే అవకాశాలుండవని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్‌కుమార్ తెలిపారు.
డిసెంబరు 2నుంచి
పీజీ, పీహెచ్‌డీ కౌన్సెలింగ్..
వ్యవసాయ పీజీ, పీహెచ్‌డీ సీట్ల భర్తీకి డిసెంబరు 2, 3తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అర్హత పొందిన విద్యార్థుల జాబితాను వర్సిటీ ఇప్పటికే ఆన్‌లైన్‌లో పెట్టింది.
0 Komentar