టిఎస్: బీకాంలోనే అత్యధిక ‘దోస్త్’లు - ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పెరిగిన ప్రవేశాలు
రాష్ట్రంలో సంప్రదాయ డిగ్రీ
కోర్సుల్లో వాణిజ్య శాస్త్రం (బీకాం)పై ఎక్కువ మంది మక్కువ చూపారు. ఈ విద్యా
సంవత్సరం(2020-21)లో డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్-తెలంగాణ(దోస్త్)
ద్వారా మొత్తం 2,12,427 మంది డిగ్రీ కోర్సుల్లో చేరగా వారిలో
అత్యధికంగా బీకాంలో 85,691 మంది ప్రవేశాలు పొందారు. ఈ
సంవత్సరం కొత్తగా బీకాం బిజినెస్ అనలిటిక్స్ కోర్సును ప్రవేశపెట్టారు. గత ఏడాది
నుంచి బీఎస్‌సీని లైఫ్ సైన్స్, ఫిజికల్ సైన్స్‌గా
విభజించారు. ఆ రెండింటిలో కలిపి 86,642 మంది చేరారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు ఏటేటా పెరుగుతున్నాయి. గత ఏడాది ఈ
కళాశాలల్లో 42,987 మంది చేరగా.. ఈసారి 45,323 మంది చేరారు. ఈ ఏడాది కొత్తగా కొన్ని పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు
దోస్త్ ద్వారా ప్రవేశాలు కల్పించారు. వాటిల్లో 607 మంది
ప్రవేశాలు పొందారు.
కోర్సుల వారీగా చేరిన విద్యార్థుల సంఖ్య
కోర్సు విద్యార్థుల సంఖ్య
బీకాం 85,691
బీఎస్సీ ఫిజికల్ సైన్స్ 45,180
బీఎస్సీ లైఫ్ సైన్స్ 41,462
బీఏ 31,179
బీసీఏ 1010
బీబీఏ 6,944
బీబీఎం 204
బీఎస్‌డబ్ల్యూ 45
బీహోక్(ఒకేషనల్) 107
డిప్లొమా 607
మొత్తం 2,12,427
విశ్వవిద్యాలయాల వారీగా...
వర్సిటీ విద్యార్థుల సంఖ్య
కేయూ 56,073
మహాత్మాగాంధీ 15,120
ఓయూ 81,448
పాలమూరు 16,670
శాతవాహన 26,027
తెలంగాణ 16,484
పాలిటెక్నిక్ కోర్సులు 607
0 Komentar