Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Police Recruitment 2020 - 20000 Jobs to Be Filled On 2021 January

 

TS Police Recruitment 2020 - 20000 Jobs to Be Filled On 2021 January

తెలంగాణలో వచ్చే ఏడాది 20000 ఉద్యోగాల భర్తీ‌.. ప్రత్యేక యాప్‌ ద్వారా నియామక ప్రక్రియ..!

తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పోలీసుశాఖలో పోస్టుల నియామకానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ పోస్టుల భర్తీకి జ‌న‌వ‌రిలోనే ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈసారి నియామక ప్రక్రియని మరింత సరళం చేసేందుకు.. ప్రత్యేక యాప్‌ రూపొందించాలని పోలీసు నియామక మండలి అధికారులు యోచిస్తున్నారు. తద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని భావిస్తున్నారు. 

పోలీసుశాఖలో ప్రస్తుతం 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. వీటిలో రాష్ట్ర వ్యాప్తంగా 425 ఎస్సై పోస్టులు అవసరమని పేర్కొన్నారు. దీనిలో ఎస్సై సివిల్‌-368, ఏఆర్‌-29, కమ్యూనికేషన్స్‌-18 పోస్టులు ఉన్నాయి. 19,300 కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీచేయాలని నివేదికలో తెలిపారు. వీటిలో సివిల్‌-7764, ఏఆర్‌-6683, టీఎస్‌ఎస్‌పీ-3874, కమ్యూనికేషన్స్‌-256, 15వ బెటాలియన్‌లో 561 ఖాళీలు ఇందులో ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీని పోలీసు నియామక మండలి చేపడుతుంది. 

పోలీసు నియామక ప్రక్రియ మిగతా ఉద్యోగాల భర్తీ కంటే భిన్నంగా ఉంటుంది. సమయమూ ఎక్కువ పడుతుంది. రాత పరీక్షలతో పాటు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాలి. అన్నింటిలోనూ ఉత్తీర్ణులై ఎంపికైన వారికి సంవత్సరంపాటు శిక్షణ ఉంటుంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరలోనే నియామక ప్రకటన జారీచేయాలని అధికారులు భావిస్తున్నారు. కాబట్టి అన్నీ అనుకూలంగా ఉంటే జనవరి నెలాఖరుకల్లా ఉద్యోగ ప్రకటన జారీ అయ్యే అవకాశం ఉంది. 

ప్రత్యేక యాప్‌ ద్వారా నియామకాలు..!

గత రెండు నియామకాల నుంచి పోలీసు ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేశాక.. తమ పేరు తప్పుగా నమోదైందని, కులం పేర్కొనలేదని చెబుతూ రకరకాల ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ సమస్యలను నివారించేందుకు ఈసారి నియామకాల కోసం ప్రత్యేకంగా యాప్‌ రూపొందించే ఆలోచనలో అధికారులు ఉన్నారు. 

అభ్యర్థులంతా ఆ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని దాని ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏవైనా తప్పులు దొర్లినా వెంటనే సరిదిద్దుకోవచ్చు. నియామకాలపై మండలి తీసుకునే నిర్ణయాలను ఎప్పటికప్పుడు యాప్‌ ద్వారా అభ్యర్థులకు చేరవేయవచ్చు. అభ్యంతరాల స్వీకరణ, అనుమానాల నివృత్తి చేయవచ్చు. ఇలా మెరుగైన నిర్వహణ కోసం ప్రత్యేక యాప్‌ అభివృద్ధి చేసి దాని ద్వారా నియామక ప్రక్రియ పూర్తిచేయాలని భావిస్తున్నారు. 

వచ్చే ఏడాది 20 వేల పోస్టుల భర్తీ: హోం మంత్రి మహయూద్‌ అలీ

తెలంగాణ పోలీసు శాఖలో వచ్చే ఏడాది 20 వేల పోస్టులు భర్తీ చేయనున్నట్లు హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. నార్త్‌జోన్‌ పరిధిలోని కార్ఖానా పోలీసుస్టేషన్‌ నూతన భవనాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గడిచిన ఆరేళ్లలో 27 వేల మంది పోలీసు పోస్టులు భర్తీ చేశామన్నారు. మహిళల భద్రతకు కీలక ప్రాధాన్యం ఇస్తూ షీటీమ్స్, భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటి సంఖ్యను పెంచుతున్నామని హోం మంత్రి వెల్లడించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags