TS: ఆన్‌లైన్‌లో టెట్
- ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదన
జీవితకాల వర్తింపుపై స్పష్టత వస్తేనే నోటిఫికేషన్
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను ఆన్‌లైన్ విధానంలో నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదించింది. ఎంసెట్, డీఎడ్ తదితర ప్రవేశ పరీక్షల మాదిరిగా ఆన్‌లైన్ విధానం (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-సీబీటీ)లో టెట్ జరిపేందుకు ప్రభుత్వ అనుమతి కోరింది. ఈ దస్త్రాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపినట్లు సమాచారం. ఇకపై టెట్ ఒకసారి పాస్ అయితే దానికి జీవిత కాలం విలువ ఉంటుందని ఇటీవల జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) తీర్మానించింది. ఇప్పటివరకు దానికి ఏడు సంవత్సరాలు మాత్రమే విలువ ఉంది. ఎన్‌సీటీఈ తీర్మానం మేరకు రాష్ట్రంలోనూ జీఓకు సవరణ చేయాల్సి ఉందని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఆ తీర్మానంపై ఇంకా గెజిట్ రాకపోవడంతో జాతీయ మండలిని సంప్రదిస్తున్నామని విద్యాశాఖ ఉన్నతాధికారి తెలిపారు. సర్టిఫికెట్‌కు విలువ ఎన్నాళ్లనేది నోటిఫికేషన్‌లో కచ్చితంగా చెప్పాలా? నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతైనా చెప్పొచ్చా? అని వివరణ కోరామని చెప్పారు. ఎన్‌సీటీఈ నుంచి స్పష్టత వచ్చాక టెట్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.
0 Komentar