UPSC IFS Main Exam Indian Forest Service
Main Exam Begins on February 28
ఐఎఫ్‌ఎస్ పరీక్ష తేదీలు
వెల్లడించిన యూపీఎస్సీ.. వివరాలివే
UPSC Exam Date 2020: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) మెయిన్ ఎగ్జామ్ తేదీలను యూపీఎస్సీ ప్రకటించింది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) మెయిన్ ఎగ్జామ్ తేదీలను ప్రకటించింది. 2021 ఫిబ్రవరి 28 నుంచి మార్చి 7 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అయితే మార్చి 1న పరీక్షలు లేవని వెల్లడించింది. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైనవారు మెయిన్ రాయడానికి అర్హత సాధిస్తారు.
ఐఎఫ్‌ఎస్ ప్రిలిమినరీ పరీక్షను అక్టోబర్ 4న యూపీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలను అక్టోబర్ 23న వెల్లడించింది. అయితే తాజాగా.. మెయిన్ పరీక్ష తేదీలను వెల్లడించింది.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) పరీక్షను సివిల్ సర్వీసెస్ పరీక్షలు పూర్తయిన తర్వాత నిర్వహిస్తారు. సివిల్స్ మెయిన్ ఎగ్జామ్ జనవరి 8 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల కానున్నాయి. పరీక్షకు మూడు, నాలుగు వారాల ముందు హాల్‌టికెట్లు విడుదల చేస్తామని యూపీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. సివిల్స్ మెయిన్స్ పరీక్షకు 10,564 మంది అర్హత సాధించారు.
ఈ పరీక్షలో జనరల్ ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, జువాలజీ, కెమిస్ట్రీ, జియాలజీ, అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్, ఫారెస్ట్రీ, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, బోటనీ పేపర్లు ఉంటాయి.
0 Komentar