Vidyadhan Scholarship Program 2020
ఇంటర్‌లో ఉపకార వేతనాలకు దరఖాస్తుల
ఆహ్వానం
ప్రతిభ ఉండి ఆర్థికంగా వెనుకబడిన
విద్యార్థుల నుంచి ఇంటర్‌లో ఉపకారవేతనాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు
విద్యాదాన్ సంస్థ ప్రకటించింది. 2020 విద్యాసంవత్సరంలో పదో
తరగతి ఉత్తీర్ణులై, అంతకుముందు 9వ
తరగతిలో 9 సీజీపీఏ లేదా 90 శాతం
మార్కులు సాధించి ఉండాలని వెల్లడించింది.
ఎంపిక చేసిన విద్యార్థులకు ఇంటర్
చదువుల కోసం ఏటా రూ.6 వేల సాయం అందిస్తామని వివరించింది. www.vidyadhan.org వెబ్‌సైట్లో డిసెంబరు 31వ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని, సందేహాలుంటే 83677
51309 నంబరులో సంప్రదించాలని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
0 Komentar