Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

WCD AP Recruitment 2020 Apply For 855 Anganwadi Worker Helper Vacancy

 

WCD AP Recruitment 2020 Apply For 855 Anganwadi Worker Helper Vacancy

ఏపీలో 855 అంగ‌న్‌వాడీ జాబ్స్‌

అనంత‌పురం జిల్లా మ‌హిళ‌, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ 855 అంగన్‌వాడీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అనంత‌పురం జిల్లా మ‌హిళ‌, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ 855 అంగన్‌వాడీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వీటిలో అంగ‌న్వాడీ హెల్ప‌ర్‌-656, అంగ‌న్వాడీ వ‌ర్క‌ర్‌-132, మినీ అంగ‌న్వాడీ వ‌ర్క‌ర్‌-57 పోస్టులున్నాయి. పదోతరగతి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల 19 దరఖాస్తుకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://ananthapuramu.ap.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. 

మొత్తం ఖాళీలు: 855

అంగ‌న్వాడీ హెల్ప‌ర్‌- 656

అంగ‌న్వాడీ వ‌ర్క‌ర్‌- 132

మినీ అంగ‌న్వాడీ వ‌ర్క‌ర్‌- 57 

ముఖ్య సమాచారం:

అర్హ‌త‌: ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తో పాటు అంగ‌న్వాడీ ఉన్న గ్రామంలో అభ్య‌ర్థులు స్థానికులు అయి ఉండాలి.

ఎంపిక విధానం: రోస్ట‌ర్ విధానం ద్వారా ప‌రిశీలించి మెరిట్‌లిస్ట్‌, రిజ‌ర్వేష‌న్ల ఆధారంగా ఉంటుంది.

వ‌య‌సు: 21-35 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.7వేల నుంచి రూ.11,500 వ‌ర‌కు ఉంటుంది.

ద‌‌ర‌ఖాస్తు విధానం: అభ్య‌ర్థులు సంబంధిత ద‌ర‌ఖాస్తును మెయిల్ ద్వారా, ప్రాజెక్టు డైరెక్ట‌ర్ కార్యాల‌యంలో నేరుగా స‌మ‌ర్పించాలి.

చిరునామా: సీడీపీఓ కార్యాల‌యం, అనంత‌పురం.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 19.12.2020

వెబ్‌సైట్‌: https://ananthapuramu.ap.gov.in/

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags