Rythu Bharosa, Niver Relief and Input
Subsidy Money to Farmers Today
నేడు రైతు భరోసాతో పాటు ఆ డబ్బులు కూడా అకౌంట్లలోకి
మంగళవారం ఒకే రోజు వైఎస్సార్ రైతు భరోసా, నివర్ తుఫాను నష్ట పరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ డబ్బులు చెల్లింపులు చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం చేయనుంది. రైతు భరోసా మూడో విడత కింద 51.59 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1,120 కోట్లు జమ చేస్తారు.
అలాగే రూ. 601.66 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపునకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇక, నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారాన్ని కూడా సీఎం జగన్ రైతుల అకౌంట్లలో జమ చేయనున్నారు. శ్రీకాకుళం మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో 7.82 లక్షల మంది రైతులు నష్టపోయినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. మొత్తం 4.59 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయశాఖ వెల్లడించింది.
అలాగే ఉద్యాన పంటల రైతులకు రూ. 44.33 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపునకు అనుమతులు జారీ చేసింది. తుఫాను వల్ల 26,731 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగిందని వివరించింది. బాధిత రైతుల ఖాతాల్లో నేరుగా నిధులను జమ చేయనున్నారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో మంగళవారం రూ.1,766 కోట్లను జమచేయనుంది. వైఎస్సార్ రైతుభరోసా– పీఎం కిసాన్ మూడో విడత కింద రూ. 1,120 కోట్లు, నివర్ తుఫాను కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులకు పెట్టుబడి రాయితీ కింద దాదాపు రూ.646 కోట్లను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.
0 Komentar