Amazon India launches ‘Amazon Academy’
to help students prep for JEE
జేఈఈ విద్యార్థుల కోసం ‘అమెజాన్
అకాడమీ’
జేఈఈకి సిద్ధమవుతున్న
విద్యార్థులకు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఆన్‌లైన్ శిక్షణను
ప్రారంభించింది. ‘అమెజాన్ అకాడమీ’ వెబ్ పోర్టల్‌ను డెస్క్‌టాప్, ఆండ్రాయిడ్
స్మార్ట్ ఫోన్ల ద్వారా సందర్శించవచ్చు. ప్రత్యక్ష వీడియో పాఠాలు, లెర్నింగ్ మెటీరియల్, ప్రాక్టీస్ టెస్టు లు,
మాక్ టెస్టులు, గత పరీక్షల ప్రశ్న పత్రాలను
వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అమెజాన్ తెలిపింది. తమ వెబ్‌సైట్‌ను
సందర్శించే విద్యార్థులకు కొద్ది నెలల వరకు ఉచితంగానే లాగిన్ అవకాశం
కల్పిస్తామన్నది. ఆసక్తి గల వారు https://academy.amazon.in వెబ్‌సైట్‌లో
లాగిన్ అవ్వొచ్చు. కాగా, స్మార్ట్ ఫోన్ కలిగిన ఎయిర్‌టెల్
వినియోగదారుల కోసం ఆమెజాన్ ప్రైమ్ వీడియోస్ ప్రత్యేక నెలవారీ ప్లాన్‌ను ప్రవేశ
పెట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలను వీక్షించాలనుకునే ఎయిర్ టెల్ ప్రీపెయిడ్
వినియోగదారులు 28 రోజులకు రూ.89 ప్లాన్‌ను
ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. వీక్షకులకు 30 రోజుల ఉచిత ట్రయల్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్
వీడియో ఇండియా డైరెక్టర్ గౌరవ్ గాంధీ తెలిపారు.
0 Komentar